Dengue: దేశంలో కలవరపెడుతున్న డెంగీ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.దీనివల్ల రంగంలోకి దిగిన కేంద్రం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష జరిపింది. డెంగీ నివారణ, నిర్మూలన చర్యలు పటిష్ఠం చేయాలని సూచనలు చేసింది.
Updated on: Sep 28, 2023 | 10:08 PM

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

దీనివల్ల రంగంలోకి దిగిన కేంద్రం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష జరిపింది. డెంగీ నివారణ, నిర్మూలన చర్యలు పటిష్ఠం చేయాలని సూచనలు చేసింది.


అన్ని రాష్ట్రాలకు స్క్రీనింగ్ కిట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిజేసిందని.. ఫాగింగ్‌తో సహా ఐఈసీ కార్యకలాపాల కోసం ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు తెలిపింది. అంతేకాదు ఆరోగ్య కార్యకర్తలకూ కూడా వీటిపట్ల ట్రైనింగ్ ఇచ్చామని చెప్పింది.

డెంగీ నిర్మూలన, నిర్వహణలో భాగంగా పర్యవేక్షణ, కేసుల నిర్వహణ, ల్యాబ్ టెస్టులు, యాంటీజెన్ టెస్టు కిట్ల సేకరించడం వంటి వివిధ కార్యక్రమాల అమలు ప్రణాళిక కింద రాష్ట్రాలకు తగిన నిధులను కూడా అందుబాటులో ఉంచామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు.





























