- Telugu News Photo Gallery Cinema photos Katrina Kaif have 14.2M followers in whats app channels telugu cinema news
Katrina Kaif: కత్రినా కైఫ్ సరికొత్త రికార్డ్.. ఆ విషయంలో ఫేస్బుక్ అధినేతను వెనక్కు నెట్టిన బాలీవుడ్ బ్యూటీ..
కత్రినా కైఫ్..పాన్ ఇండియా లెవల్లో అత్యథిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మళ్లీశ్వరి సినిమాతో తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కత్రినా. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో విక్కీ కౌశల్ ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కత్రినా.
Updated on: Sep 27, 2023 | 7:39 PM

కత్రినా కైఫ్..పాన్ ఇండియా లెవల్లో అత్యథిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మళ్లీశ్వరి సినిమాతో తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కత్రినా.

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో విక్కీ కౌశల్ ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కత్రినా.

తాజాగా కత్రినా కైఫ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఛానల్స్ సదుపాయంలో కత్రినా కైఫ్ 14 మిలియన్స్ ఫాలోవర్లతో ముందువరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉంది.

ఇప్పటివరకు వాట్సప్ ఛానల్ కు అత్యథికంగా 23 మిలి మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానల్ 14.4 మిలయన్లతో మూడో స్థానంలో నిలిచింది.

ఇక ఆ తర్వాత కత్రినా కైఫ్ 14.2 మిలయన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలయన్స్.. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ 9.2 మిలయన్స్ ఫాలోవర్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసింది.




