- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS: Rohit Sharma becomes second and fastest to hit 550 sixes in International Cricket, 3 hits away to win Gayle’s record
IND vs AUS: రోహిత్ శర్మ @551.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా రికార్డ్.. మరో 3 కొడితే అగ్రస్థానం హిట్‌మ్యాన్‌దే..
IND vs AUS: భారత్ v ఆస్ట్రేలియా మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఆసీస్ ఇచ్చిన 353 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో మొత్తం 81 పరుగులు చేశాడు. తద్వారా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డ్ సృష్టించడమే కాక ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా నిలిచాడు. ఇంతకీ రోహిత్ నెలకొల్పిన ఆ రికార్డ్ ఏంటీ..? రోహిత్ కంటే ముందు ఎవరున్నారు..?
Updated on: Sep 27, 2023 | 9:09 PM

IND vs AUS 3rd ODI: భారత్ v ఆస్ట్రేలియా మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఆసీస్ ఇచ్చిన 353 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో మొత్తం 81 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో రోహిత్ తన 5వ సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 550 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 551 సిక్సర్లు కొట్టిన రోహిత్.. 500, 550 సిక్సర్ల మార్క్ దాటిన రెండో ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 550 సిక్సర్ల మార్క్‌ని చేరుకున్న ఆటగాడిగా కూడా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ 548 ఇన్నింగ్స్‌ల్లో 550 సిక్సర్ల మార్క్‌ని దాటగా.. రోహిత్ 471 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తన కెరీర్‌లో 553 సిక్సర్లు బాదగా.. రోహిత్ శర్మ ఇప్పటికే 551 సిక్సర్లు కొట్టాడు. అంటే వరల్డ్ కప్ వేదికగా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డ్ కూడా రోహిత్ శర్మ సొంతం కానుంది.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో గేల్, శర్మ తర్వాత.. షాహిద్ అఫ్రిదీ(పాక్, 476 సిక్సర్లు), బ్రెండన్ మెకాల్లమ్(న్యూజిలాండ్ 398), మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్ 383) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.




