Viral News: కూతురి పెళ్లి కోసం బ్యాంక్‌ లాకర్‌లో పెట్టిన రూ.18లక్షల నగదు, నగలు చెదల పాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఓ బ్రాంచ్ లాకర్‌లో నగలతో పాటు డబ్బును దాచుకుంది బాధితురాలు. ఆ డబ్బును తన కూతురు పెళ్లి కోసం కూడబెట్టింది. కొన్ని నెలల తర్వాత డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన మహిళ దీన్ని చూసి షాక్‌కు గురైంది. బ్యాంక్‌ లాకర్‌లో దాచిపెట్టిన డబ్బును చెదలు పట్టడం ఎంటని బాధితురాలు బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంక్‌ వద్దే ఆందోళనకు దిగింది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు.

Viral News: కూతురి పెళ్లి కోసం బ్యాంక్‌ లాకర్‌లో పెట్టిన రూ.18లక్షల నగదు, నగలు చెదల పాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?
Termites Damage
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2023 | 8:09 PM

ఇదొక ఆశ్చర్యకరమైన, షాకింగ్ సంఘటన. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు భద్రంగా ఉంటుందని నమ్మి బ్యాంకులో దాచుకుంటుంటారు. నగదు, నగలు, విలువైన పత్రాలను బ్యాంక్‌ లాకర్‌లో దాచుకుంటారు. అయితే, కూతురి పెళ్లి కోసమని కూడబెట్టిన డబ్బు పొదుపు చేసి బ్యాంక్‌ లాకర్ లో ఉంచిన ఓ మహిళ.. కొన్ని నెలల తర్వాత డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఆమెకు ఊహించని సీన్‌తో ఒక్కసారిగా షాక్‌ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షలను బ్యాంకు లాకర్‌లో ఉంచింది. చాలా రోజుల తర్వాత లాకర్‌ని తెరవగానే ఆమెకు షాకింగ్‌ సీన్‌ కనిపించింది. లాకర్‌లో ఉన్న డబ్బును పెద్ద మొత్తంలో చెదలు పట్టేసింది. ఈ ఘటన మొరాదాబాద్‌లోని ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో చోటుచేసుకుంది.

అల్కా పాఠక్ అనే మహిళ 2022లో బ్యాంక్ లాకర్‌లో కొన్ని విలువైన ఆభరణాలతో పాటు డబ్బును భద్రపరిచింది.  అల్కా, పిల్లలకు ట్యూషన్లు చెబుతూ తన కూతురి పెళ్లి కోసం డబ్బు కూడబెట్టుకుంది. అలా సంపాదించిన డబ్బు, నగలు.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన రామగంగా విహార్ బ్రాంచ్ లాకర్‌లో నగలతో పాటు డబ్బును దాచుకుంది బాధితురాలు. ఆ డబ్బును తన కూతురు పెళ్లి కోసం కూడబెట్టింది. కొన్ని నెలల తర్వాత డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన మహిళ దీన్ని చూసి షాక్‌కు గురైంది. బ్యాంక్‌ లాకర్‌లో దాచిపెట్టిన డబ్బును చెదలు పట్టడం ఎంటని బాధితురాలు బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంక్‌ వద్దే ఆందోళనకు దిగింది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు.

ఉదయపూర్‌లో కూడా చెదపురుగు సోకిన ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఇదే ఫిబ్రవరిలో ఉదయపూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బ్రాంచ్‌లో లాకర్‌లో ఉంచిన రూ.2.15 లక్షల రూపాయలను చెదపురుగులు ధ్వంసం చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. డబ్బుల యజమాని సునీతా మెహతా రూ.2 లక్షలను క్లాత్‌ కుట్టిన సంచిలో ఉంచగా మిగిలిన మొత్తాన్ని బ్యాగ్ బయట ఉంచింది. బ్యాగ్‌ని తెరిచి చూడగా డబ్బులు చెదలు తిన్నట్లు గమనించారు.

ఇవి కూడా చదవండి

లాకర్‌లో నిల్వ ఉంచిన వస్తువులకు నష్టం వాటిల్లిందని, బ్యాంకు నిర్లక్ష్యం, చీడపీడల నివారణ చర్యలు చేపట్టకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 20 నుంచి 25 లాకర్లు చెదపురుగుల బారిన పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, విచారణ జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని సీనియర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ తెలిపారు. నష్టం గురించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ధృవీకరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని బ్యాంకు తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..