Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్య బాబోయ్! విశాఖను హడలెత్తిస్తున్న కొండచిలువలు.. మొన్నటికి మొన్న నాలుగు.. ఇప్పుడు మరో..

Visakhapatnam: తాజాగా విశాఖ లోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రహారీ వెనుక 25 అడుగుల భారీ కొండ చిలువ ఒకటి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. కొండవాలు ప్రాంతమైన లక్ష్మి నగర్ లో నిన్న సాయంత్రం ఆ మార్గంలో వెళ్తున్న వారికి రోడ్ దాటుతూ జనా వాసాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ కంటపడింది. దాదాపు 25 అడుగుల పొడవు, సుమారు 70 కేజీల బరువు ఉన్న ఆ కొండ చిలువ అప్పటికే ఏదో వన్య ప్రాణిని మింగేసి నెమ్మదిగా కదులుతోంది.

Andhra Pradesh: అయ్య బాబోయ్! విశాఖను హడలెత్తిస్తున్న కొండచిలువలు.. మొన్నటికి మొన్న నాలుగు.. ఇప్పుడు మరో..
Python
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 27, 2023 | 6:02 PM

విశాఖపట్నం, సెప్టెంబర్27; సిటీ ఆఫ్ డెస్టినీ కొండ చిలువ లకు కూడా హబ్ గా మారుతున్నట్టు కనిపిస్తోంది..ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నాయో తెలియదు కానీ తాజాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం ఎక్కడో ఒక చోట వీటి మూమెంట్ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా కొండ చరియ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు ఎలా కనిపిస్తాయో ఆన్న ఆందోళన కలుగుతోంది. పశువులశాలల్లో నో, కోళ్ల గంపల దగ్గరో చేరి వాటిల్ని మాయం చేసేస్తూ ఉంటుండడం తో స్థానికుల్లో భయం నెలకొంది. ఒకవేళ అలాంటి సమయాల్లో చిన్న పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ పరిస్తితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు కొండవాలు ప్రాంతాల ప్రజల్లో కనిపిస్తూ ఉంది. గతంలో విశాఖ నగరంలో కాకపోయినా ఉమ్మడి విశాఖ జిల్లా లో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ. ఇటీవల మూడు నెలల క్రితం పాడేరు సమీపం లో ఇలానే అడవికి వెళ్ళిన ముగ్గురిలో ఒక వ్యక్తి కాలును మింగేసింది ఒక కొండ చిలువ, అది చూసి మిగతా ఇద్దరూ పరారవగా, ఆ వ్యక్తి మాత్రం పైథాన్ తో పోరాడి చివరకు తప్పించుకుని హాస్పిటల్ లో చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇలానే విశాఖ లో గంప కింద దూరి కోళ్ల నుబ్రున్న నేపథ్యం ఉంది.

తాజాగా ఎన్ ఎస్ టి ఎల్ ప్రహారీ వెనుక భారీ కొండ చిలువ

తాజాగా విశాఖ లోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రహారీ వెనుక 25 అడుగుల భారీ కొండ చిలువ ఒకటి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. కొండవాలు ప్రాంతమైన లక్ష్మి నగర్ లో నిన్న సాయంత్రం ఆ మార్గంలో వెళ్తున్న వారికి రోడ్ దాటుతూ జనా వాసాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ కంటపడింది. దాదాపు 25 అడుగుల పొడవు, సుమారు 70 కేజీల బరువు ఉన్న ఆ కొండ చిలువ అప్పటికే ఏదో వన్య ప్రాణిని మింగేసి నెమ్మదిగా కదులుతోంది. సమీపంలోనే ఇల్లు ఉండడం, ఆ కాలనీ కి చెందిన కొందరు పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉండడం తో ఒక వేళ పిల్లలపై ఆ కొండ చిలువ పంజా విసిరి ఉంటే ఏమై ఉందేదన్న భయం ఆ గ్రామ వాసులను కాసేపు వణికించింది. వెంటనే తెలిసిన వాళ్ళ సహకారం తో పాములను పట్టే స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చి దాన్ని రెస్క్యూ చేశారు కిరణ్

ఇవి కూడా చదవండి

వనారణ్యం లోకి

అలా పట్టుకున్న కొండ చిలువలను స్నేక్ క్యాచర్ కిరణ్ ఒక చోట ఉంచి 4, 5 అయ్యాక అభయారణ్యం లోకి తీసుకెళ్ళి వదులుతున్నారు కిరణ్. ఇటీవలనే ఇలాంటి 4 కొండ చిలువ లను బుట్టలో పట్టుకెళ్ళి సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. విశాఖ లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు నిరంతరం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీటి కోసం జీ వి ఎం సి ప్రత్యేక ఏర్పాటు చేయాలని కొండ వాలు ప్రాంత వాసులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..