Watch Viral Video: వృద్ధుడి రూపంలో వచ్చిన ప్రత్యక్ష దైవం.. నాలుగేళ్ల చిన్నారికి పునర్జన్మ
పాపను కాపాడాలంటే.. అందరూ భయపడిపోయారు. కానీ, ఒక తెలివైన, ధైర్యవంతుడైన వృద్ధుడు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని రక్షించాడు. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు లాగారు. అలా ఆ బాలిక క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వృద్ధుడే అయినప్పటికీ అతని సమయస్పూర్తిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
వర్షాకాలంలో సాధారణంగా చెట్లు, కరెంటు స్తంబాలు నేలకూలటం చూస్తుంటాం. అయితే, చాలా ప్రాంతాల్లో కరెంటు వైర్లు కూడా తెగిపోయి కిందపడుతుంటాయి. విద్యుత్ షాక్‌కు గురై పశువులు, మనుషులు కూడా చనిపోతుంటారు. కరెంట్ షాక్ తగిలినప్పుడు ఏం చేయాలో, బాధితుల్ని ఎలా రక్షించాలో చాలా మందికి తెలియదు.. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని చూడగానే భయంతో, అయోమయంలో పడుతుంటారు.. కరెంట్ ఆఫ్ చేయాలని, కర్ర సాయంతో కాపాడొచ్చుననే తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. అయితే, సరిగ్గా అలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ వారణాసి పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి కరెంట్ షాక్ కు గురై నీటిలో పడిపోయింది. ఆ నీటిలో తల్లడిల్లుతోంది. చిన్నారి పరిస్థితిని గమనించిన పలువురు..ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు.. అందులో యువకులు కూడా ఉన్నారు. కానీ ఆ బాలికను కాపాడేందుకు ముందుకు రాలేదు. అంతలోనే అటుగా వచ్చిన ఓ వృద్ధుడు చాకచక్యంగా ఆ బాలికను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూపీలోని వారణాసి పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి కరెంటు వైర్ ను తాకడంతో షాక్ కొట్టింది. దాంతో చిన్నారి రోడ్డుపై ఉన్న నీళ్లల్లో పడిపోయి కొట్టుకుంటోంది. సుమారు ఓ నిమిషం పాటు చిన్నారి కరెంట్ షాక్ తో నీళ్లలోనే తల్లడిల్లిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు చాలా మంది చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, కరెంట్ షాక్ కొట్టడంతో వెనుదిరిగారు. పాపను కాపాడాలంటే.. అందరూ భయపడిపోయారు. కానీ, ఒక తెలివైన, ధైర్యవంతుడైన వృద్ధుడు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని రక్షించాడు.
#वाराणसी सिस्टम पर सवाल खड़ा करते वीडियो हुआ वायरल,सड़क पर भरे पानी में उतरा करंट,चपेट में आया 4 वर्षीय बालक,बीच सड़क पर तड़पता रहा बच्चा, देखते रहे राहगीर,बच्चे को बचाने के लिए बुजुर्ग ने उठाई जहमत,चेतगंज थाना क्षेत्र के हबीबपुरा का मामला pic.twitter.com/nW0eZJBhqm
— ठाkur Ankit Singh (@liveankitknp) September 26, 2023
ముందుగా ఆ రోడ్డుపైకి ఓ ఆటో వచ్చింది. అయితే, అక్కడి పరిస్థితి గమనించిన ఆటో డ్రైవర్ వాహనాన్ని వెనక్కి మళ్లించాడు.. కానీ, ఆటోలో ఉన్న ఒక వృద్ధుడు చిన్నారిని చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ కరెంట్ షాక్ తగలడంతో ఆయన కూడా వెనక్కి వచ్చేశారు. ఆ వెంటనే అక్కడికి మరో వృద్ధుడు వచ్చారు. పరిస్థితి మొత్తం అర్థం చేసుకున్న ఆయన వేగంగా స్పందించారు. చుట్టు పక్కలా అటూ, ఇటూ తిరిగి ఓ కర్రను తీసుకున్నారు. ఆ కర్రను పట్టుకోవాలని బాలికకు చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత ఆ బాలిక కర్రను పట్టుకుంది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు లాగారు. అలా ఆ బాలిక క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వృద్ధుడే అయినప్పటికీ అతని సమయస్పూర్తిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..