Asian Games: 10 వేల మంది ఉన్న స్టేడియంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్.. ఎలా దొరికిందో తెలుసా..?
పోగొట్టుకున్న ఫోన్ దొరకడం అంటే అంతకంటే.. ఆశ్చర్యం, సంతోషకరమైన మాట ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒకసారి మన చేతిలోంచి జారిపోయిన మొబైల్‌ఫోన్ తిరిగి దొరకటం చాలా కష్టమే..! అది కూడా స్విచ్చాఫ్ చేసిన ఫోన్ రద్దీ ప్రదేశాల్లో మిస్ ప్లేస్ అయినప్పుడు ఇక అంతే సంగతి.. ఇక దానిపై ఆశలు వదలుకోవాల్సిందే..! కానీ, ఇక్కడో యువతి పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ 24గంటల్లోనే తిరిగి తన చేతికి వచ్చింది..
పోగొట్టుకున్న ఫోన్ దొరకడం అంటే అంతకంటే.. ఆశ్చర్యం, సంతోషకరమైన మాట ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒకసారి మన చేతిలోంచి జారిపోయిన మొబైల్‌ఫోన్ తిరిగి దొరకటం చాలా కష్టమే..! అది కూడా స్విచ్చాఫ్ చేసిన ఫోన్ రద్దీ ప్రదేశాల్లో మిస్ ప్లేస్ అయినప్పుడు ఇక అంతే సంగతి.. ఇక దానిపై ఆశలు వదలుకోవాల్సిందే..! కానీ, ఇక్కడో యువతి పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ 24గంటల్లోనే తిరిగి తన చేతికి వచ్చింది.. ఇది జరిగింది ఎక్కడో కాదు.. చైనాలో. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఓ క్రీడాకారిణి తన మొబైల్‌ఫోన్‌ని పొగొట్టుకుంది. 10వేల మంది ఉన్న స్టేడియంలో ఆమె తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంది. కానీ, ఆమె అదృష్టం బాగుంది.. ఆమె పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి తనకు దొరికింది. ఆసియా గేమ్స్ వాలంటీర్లు ఎంతో కష్టపడి ఆమె ఫోన్‌ను కనిపెట్టి అప్పజెప్పారు.
హాంకాంగ్ కు చెందిన 12 ఏళ్ల చెస్ క్రీడాకారిణి లియు తియాన్ యి.. హాంగ్‌జౌ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంది. సోమవారం ఉదయం టోర్నీలో పాల్గొనేందుకు స్టేడియంకు వచ్చిన లియు.. తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. పైగా అది స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో ఈ విషయాన్ని నిర్వాహకులకు చెప్పింది. దీంతో టోర్నీలు పూర్తయిన తర్వాత వాలంటీర్లు ఫోన్ కోసం వెతికారు. వారు రాత్రిపూట పదివేల చెత్త సంచులలో వెతికారు. చెస్ ప్లేయర్ లియు టియాన్-యి ఫోన్ చెత్త సంచిలో పడింది. ఆ మొబైల్‌ను తిరిగి సంపాదించటం నిజంగా ఒక అద్భుతంగానే చెప్పాలి. పోగొట్టుకున్న ఫోన్ 24 గంటలలోపుగానే వెతికించారు.
దాదాపు 10,000 సీట్లు ఉన్న 5,23,000 చదరపు మీటర్ల స్టేడియంలో స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ ఫోన్‌ను గుర్తించడం నిజంగానే వండర్. హాంగ్‌జౌ ఆసియా క్రీడలు దీన్ని సుసాధ్యంగా చేసి చూపించారు. వాలంటీర్ల బృందం రాత్రిపూట డజన్ల కొద్దీ చెత్త సంచులను జల్లెడ పట్టింది. ఎట్టకేలకు, ఆ మొబైల్ ప్లేయర్ చేతికి అందింది. అని హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
హాంగ్‌జౌ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 8 వరకు 45 దేశాల నుంచి 12,000 మందికి పైగా అథ్లెట్లు ఇక్కడ పోటీపడనున్నారు. హాంగ్‌జౌ ఆసియా క్రీడలు గత ఏడాది జరగాల్సి ఉండగా చైనాలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా వాయిదా పడింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..