ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లికి నెల రోజుల ముందు వరుడు కోమాలోకి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

పెళ్లికి ఒక నెల రోజుల సమయం ఉండగానే, హితెన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెదడుకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.. బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ అతన్ని వైద్య సంరక్షణలో ఉంచింది వ్రీని ఖన్నా.. అతనికి నిరంతరం సపర్యాలు చేస్తూ.. వెంటే ఉండి చూసుకుంది. హితేన్‌ పరిస్థితి చూసి అందరూ చలించిపోయారు.. అతన్ని మర్చిపోవాలంటూ వ్రీనిని బలవంతపెట్టారు. దాంతో ఆమె..

ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లికి నెల రోజుల ముందు వరుడు కోమాలోకి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Love Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2023 | 9:24 PM

వ్రీని ఖన్నా, హితేన్ ఎనిమిదేళ్ల పాటు ఒకరినోకరు ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. కానీ, అంతలోనే వారి ప్రేమ కథ కన్నీళ్లు మిగిల్చింది. పెళ్లికి ఒక నెల రోజుల సమయం ఉండగానే, హితెన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెదడుకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.. బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ అతన్ని వైద్య సంరక్షణలో ఉంచింది వ్రీని ఖన్నా.. అతనికి నిరంతరం సపర్యాలు చేస్తూ.. వెంటే ఉండి చూసుకుంది. హితేన్‌ పరిస్థితి చూసి అందరూ చలించిపోయారు.. అతన్ని మర్చిపోవాలంటూ వ్రీనిని బలవంతపెట్టారు. కానీ, ఆమె తన ప్రియుడిపై ఉన్న ప్రేమతో అతడిని ఎలాగైనా బతికించుకోవాలని పోరాడింది..ఎట్టకేలకు అతను 3 నెలల వైద్య చికిత్స అనంతరం కోమా నుండి బయటపడ్డాడు.

కానీ, ఈ మూడు నెలల్లో అతడు సుమారు 30కిలోల బరువు తగ్గిపోయాడు. స్వయంగా లేచి నడవలేడు. ఏ పని సొంతంగా చేసుకోలేడు.. కానీ, అతడు బతికి బయటపడంతో వ్రీని సంతోషంగా అతడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అతడిని పెళ్లి చేసుకోవద్దని కుటుంబసభ్యులంతా ఎంతగా అడ్డుచెప్పినా ఆమె ఎవరి మాట వినలేదు. ఆ తర్వాత 2022 జులై 6వ తేదీన వీరి వివాహం జరిగింది. ఇదంతా వ్రీని హిట్టేన్ ప్రేమ ప్రయాణం పేరుతో సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్‌ చేశారు. దాంతో వార్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో అఫీషియల్‌పీపుల్‌ఆఫిండియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నాలుగు గంటల వ్యవధిలోనే.. ఈ వీడియోను దాదాపు 1.7 లక్షల మంది లైక్ చేశారు. వేలాది మంది నెటిజన్లు వ్రీని, హితేన్‌లను అభినందించారు. వ్రినియా సహనం, ప్రేమను నెటిజన్లు ఎంతగానో అభినందించారు.

అమ్మాయిలు ఎప్పుడూ తాము ప్రేమించిన అబ్బాయి, పెళ్లి చేసుకున్న భర్త కోసమే జీవిస్తారని, వారి కోసం ఎలాంటి కష్టానైనా ఎదిరిస్తారంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. ఈ ప్రపంచంలోనే గొప్ప శక్తి ప్రేమ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యనించారు.. డాక్టర్లు కూడా చేతులెత్తేసిన వ్రిని ప్రేమ అతన్ని కాపాడిందంటూ మరికొందరు స్పందించారు. ఈ వీడియో చూసి నాకు ఏడుపు వస్తోంది, చాలా మంది స్వార్థపరులను చూశాను. కానీ మీలాంటి అమ్మాయిలు చాలా అరుదు, మీ ఇద్దరికీ శుభం కలుగుతుంది’’ అని మరొకరు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..