Viral Video: ఎక్వేరియం కాదు.. డ్రైనేజ్.. హ్యాపీగా ఈతకొడుతున్న చేపలు.. నెట్టింట్లో వీడియో వైరల్..
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక డ్రైనేజ్ కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కాలువలోని నీరు నదిలో ప్రవహించే నీటిలా శుభ్రంగా ఉంటాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కాలువల్లో రంగురంగుల చేపలు ఈత కొట్టడం. నదీ జలాల వంటి ఈ స్వచ్ఛమైన కాలువ జపాన్‌లోని నాగసాకిలో ఉందని ప్రచారం జరుగుతోంది.

ఎవరైనా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నా ఇల్లు బాగుంటే చాలు.. ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటే మాకేంటి అంటూ ఇంట్లో చెత్తను వీధుల్లో పారబోసేవారు అనేక మంది ఉన్నారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే.. దేశం ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండదు. అయితే ఎక్కడ చూసినా చెత్త చెదారం.. మలినాన్ని ఇంటి చుట్టూ పక్కల పరిసరాల్లో, రోడ్లమీద వ్యాపింపజేస్తూ అదేదో గర్వంగా భావించే వారితో దేశం నిండిపోయింది. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం, ప్లాస్టిక్, పేపర్ లేదా ఇతర చెత్తా చెదారాలను డ్రైన్లలోకి విసిరేస్తున్నారు. ఇలా చేస్తున్న చాలా మందిని మీరు చూసే ఉంటారు. మన చుట్టు పక్కల డ్రైన్స్ తరచుగా మురికితో నిండి పొంగి పొర్లడానికి ఇదే కారణం..అంతేకాదు మన వీధుల్లోని డ్రైన్స్ నల్లగా మారిన నీరు వ్రవహిస్తూ దాని పక్కన నుంచి వెళ్లాలంటే దుర్వాసనతో ముక్కు మూసుకుని వెళ్తాము. అయితే జపాన్‌లోని మురికి కాలువలలోని నీరు చూస్తే ఆశ్చర్య పోతాయి. ఎందుకంటే ఆ మురికి కాల్వలో నీరు ఎంతో స్వచ్ఛంగా.. శుభ్రంగా ఉంటాయి.
జపాన్ అభివృద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అనేక ఆధునిక విజ్ఞాన సంపదతో ప్రసిద్ధి చెందింది. మానవ మేథస్సుని ప్రపంచానికి పరిచయం చేస్తూ అనేక ఆవిష్కరణలు ఆ దేశంలో కనిపిస్తాయి. కొన్ని ప్రజలను ఆలోచించేలా చేస్తాయి. ప్రస్తుతం ఆ దేశంలోని డ్రెయిన్లు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక డ్రైనేజ్ కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కాలువలోని నీరు నదిలో ప్రవహించే నీటిలా శుభ్రంగా ఉంటాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కాలువల్లో రంగురంగుల చేపలు ఈత కొట్టడం. నదీ జలాల వంటి ఈ స్వచ్ఛమైన కాలువ జపాన్‌లోని నాగసాకిలో ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్త నిజమని TV9 ధృవీకరించలేదు.
వీడియో చూడండి
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో timmy727 అనే IDతో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 1.5 మిలియన్లు అంటే 15 లక్షల సార్లు వీక్షించబడింది. అయితే 1 లక్ష 95 వేల మందికి పైగా ప్రజలు వీడియోను ఇష్టపడ్డారు. వివిధ రకాల ప్రతిచర్యలు, కామెంట్స్ చేస్తున్నారు.
అందుకే జపాన్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశమని కొందరంటే.. ‘నేను జపాన్ వెళ్లినప్పుడు ఈ ప్రదేశాన్ని చూడకుండా ఎలా మిస్ అయ్యాను’ అని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో ఒక వినియోగదారు ‘నేను జపనీస్‌ని. ఈ కాలవలోని నీరు వాస్తవానికి వరి సాగు కోసం పొలాలకు ప్రవహిస్తోంది. ఈ నీరు చక్కగా ఉంటుంది. అంతేకాని ఇది మురికి కాలువ కాదని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..