Viral News: ఈ తెగలో అన్నీ వింత ఆచారాలే.. జీవితంలో మహిళలు ఒక్కసారే స్నానం .. దంపతుల మధ్య బంధమే విచిత్రం..

ప్రపంచంలోని సంప్రదాయాలు, నియమాలు, నిబంధనలు భిన్నంగా ఉన్న తెగ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. అంతేకాదు ఈ తెగ కి సంబదించిన ఆచార వ్యవహారాలు, నియమ నిబంధలు తెలిస్తే.. ఇదెక్కడి విచిత్రం అంటూ ఆశ్చర్య పోతారు. ఈ తెగలోని    విచిత్రమైన ఆచారం ఏమిటంటే భర్తలు స్వయంగా తమ భార్యలను తమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులతో శారీరక సంబంధానికి పంపుతారు.

Viral News: ఈ తెగలో అన్నీ వింత ఆచారాలే.. జీవితంలో మహిళలు ఒక్కసారే స్నానం .. దంపతుల మధ్య బంధమే విచిత్రం..
Himba Tribe
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2023 | 9:31 AM

ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన సంబంధాలలో భార్యాభర్తల మధ్య సంబంధం ఒకటి.  ఈ బంధంలో    ప్రేమ, అంకితభావం ఒకరికోసం ఒకరు అనే ఫీలింగ్ఉంటుంది. అయితే కొంతమంది ఈ సంబంధాన్ని సిగ్గుపడేలా కూడా చేస్తున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ.. భర్త మరొక స్త్రీతో లేదా భార్య తన భర్తకి ద్రోహం చేస్తూ మరొక పురుషుడితో సంబంధం కలిగి ఉంటున్నాడు. ఇలా భర్త లేదా భార్యను మోసం చేస్తున్న ఘటనల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ప్రపంచంలోని సంప్రదాయాలు, నియమాలు, నిబంధనలు భిన్నంగా ఉన్న తెగ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. అంతేకాదు ఈ తెగ కి సంబదించిన ఆచార వ్యవహారాలు, నియమ నిబంధలు తెలిస్తే.. ఇదెక్కడి విచిత్రం అంటూ ఆశ్చర్య పోతారు. ఈ తెగలోని    విచిత్రమైన ఆచారం ఏమిటంటే భర్తలు స్వయంగా తమ భార్యలను తమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులతో శారీరక సంబంధానికి పంపుతారు. ఇలా చేయడానికి కూడా ఒక కారణం అందంటూ లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ తెలిస్తే… ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే..

ఈ తెగను హింబా తెగ అంటారు. ఈ తెగ నమీబియాలో నివసిస్తుంది. దేశం మొత్తం మీదా ఈ తెగ జనాభా సుమారు 50 వేలు ఉంటుంది. ఈ తెగ ప్రజల్లో చాలా విచిత్రమైన నియమాలు, నిబంధనలున్నాయి. ఈ తెగ మహిళల స్నానం చేయడంపై నిషేధం. ఆమె పుట్టినప్పటి నుంచి మరణించే లోపు తన జీవితంలో ఒకేఒక్కసారి స్నానం చేస్తుంది. యువతి వివాహం చేసుకునే సమయంలో మాత్రమే స్నానం చేయడానికి అనుమతిస్తారు. అది కూడా ఒక్కసారి మాత్రమే. ఆ తర్వాత ఆమె జీవితంలో మళ్లీ స్నానం చేయదు. అయితే తన శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి దుర్వాసన రాకుండా ఉండడానికి నిత్యం అనేక మూలికలను  ఉపయోగిస్తుంది. వీటి సాయంలో దుర్వాసనను తొలిగించుకుంటారు.

మరో వింత ఆచారం

డైలీ స్టార్ నివేదిక ప్రకారం ఒక పర్యాటకుడు తమ గ్రామానికి వచ్చినప్పుడల్లా.. తమ భర్తలు స్వయంగా తమ భార్యలను ఆ పర్యాటకుల వద్దకు పంపిస్తారు. ఇలా చేయడం వల్ల తమ భార్య, భర్తల బంధంలో అసూయ భావం తొలగిపోతుందని వారు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

పుట్టిన తేదీని లెక్కించడానికి స్పెషల్ నియమం

సాధారణంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు.. అతని వయస్సు భూమి మీద పడినప్పటి నుండి లెక్కిస్తారు. అయితే ఈ  హింబా తెగలో మాత్రం ఇది విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ఒక స్త్రీ బిడ్డ పుట్టడం గురించి ఆలోచించిన క్షణం నుండి పిల్లల ‘పుట్టిన తేదీ’ లెక్కించడం ప్రారంభమవుతుంది. అవును, ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ హింబా తెగలో పుట్టిన రోజు తేదీ లెక్కింపు విషయంలో ఇదే జరుగుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..