Elephant: బురదగుంటలో కూరుకుపోయిన గున్నఏనుగు.. బయటపడలేక పాపం.. వీడియో.
ఏనుగులు నీటిలో, బురద గుంటల్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడతాయి. నీళ్లను తొండంతో ఒంటిపై చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తాయి. బురద గుంటల్లో కూడా ఆడుతూ ఉంటాయి. అలా ఓ గున్న ఏనుగు బురద గుంట కనిపించగానే పరుగున వెళ్లి అందులో దిగింది. పాపం అది లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. అడుగు కదిపే పరిస్థితి లేకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించి ప్రయత్నించి నీరసించిపోయి నిస్సహాయంగా పడిపోయింది.
ఏనుగులు నీటిలో, బురద గుంటల్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడతాయి. నీళ్లను తొండంతో ఒంటిపై చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తాయి. బురద గుంటల్లో కూడా ఆడుతూ ఉంటాయి. అలా ఓ గున్న ఏనుగు బురద గుంట కనిపించగానే పరుగున వెళ్లి అందులో దిగింది. పాపం అది లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. అడుగు కదిపే పరిస్థితి లేకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించి ప్రయత్నించి నీరసించిపోయి నిస్సహాయంగా పడిపోయింది. చుట్టుపక్కల ఎలాంటి జంతువుల జాడా లేదు. ఆ గున్న ఏనుగు అక్కడికి ఒంటరిగా వచ్చిందో ఏమో ఆ సమీపంలో ఇతర ఏనుగులు కూడా ఏమీ కనిపించలేదు. కానీ ఆవగింజంత ఆయుష్యు ఉన్నా ఎలాంటి ప్రాణసంకటం నుంచైనా బయటపడొచ్చన్నట్టుగా స్థానికులు ఎవరో ఆ ఏనుగును గమనించి అటవీసిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది గున్న ఏనుగును కాపాడిన తీరు అందరినీ కాట్టుకుంటోంది. బురదలో చిక్కుకుపోయిన ఏనుగు కిందనుంచి తాళ్లను తొడిగి వాటిని భారీ వాహనాలకు కట్టి బయటకు లాగారు. దాంతో బయటపడిన గున్న ఏనుగు తనను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు అన్నట్టుగా వారివైపు చూసి ఆనందంగా తన గుంపును వెతుక్కుంటూ వెళ్లిపోయింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటవీ సిబ్బంది చేసిన కృషికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

