Telangana: భాగ్యనగరంలోనే కాస్ట్లీ గణేశుడు.. ఎటు చూసినా కరెన్సీ నోట్లే.. ఎక్కడో తెలుసా..?

Hyderabad: ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వటంతో దానిని ప్రతిబింబిస్తూ గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రయోగం ఎలా జరిగింది.. రాకెట్ లాంచింగ్.. లాండర్.. రోవర్ చంద్రుడు మీద చేసిన ప్రయోగాలు ఇలాంటివన్నీ క్లియర్ గా అర్థమయ్యే విధంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. భక్తి, విజ్ఞానంతో పాటు చిన్న పిల్లలను ఇటువంటి మండపాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి.

Telangana: భాగ్యనగరంలోనే కాస్ట్లీ గణేశుడు.. ఎటు చూసినా కరెన్సీ నోట్లే.. ఎక్కడో తెలుసా..?
Ganesh Idol Decorated With
Follow us
Sravan Kumar B

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 26, 2023 | 7:53 PM

హైదరాబాద్, సెప్టెంబర్26: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న తర్వాత విగ్నేశ్వరుడు భారీ ఊరేగింపుగా బయలు దేరి నిమజ్జనానికి వెళతాడు. గణేష్ చతుర్ధి సందర్భంగా ప్రతి వాడ ప్రతి గల్లీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయటంతో ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి వివిధ రకాల ఆకారాల్లో విగ్నేశ్వరుల విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఎవరి క్రియేటివిటీకి తగ్గట్టుగా ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వింత వింత ఆకారాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తులను ఆకర్షిస్తుంటారు. నగరంలో అనేకచోట్ల ఉన్న డిజైన్లలో లేటెస్ట్ ట్రెండ్ టాపిక్‌ తీసుకొని తమ క్రియేటివిటీని జోడించి వినాయకుడిని తయారు చేశారు. తాము అభిమానిస్తున్న పార్టీని, పార్టీ నాయకులను ప్రతిబింబిస్తూ జనసేన ని పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ ఆకారంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వటంతో దానిని ప్రతిబింబిస్తూ గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రయోగం ఎలా జరిగింది.. రాకెట్ లాంచింగ్.. లాండర్.. రోవర్ చంద్రుడు మీద చేసిన ప్రయోగాలు ఇలాంటివన్నీ క్లియర్ గా అర్థమయ్యే విధంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. భక్తి, విజ్ఞానంతో పాటు చిన్న పిల్లలను ఇటువంటి మండపాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక తమ ఆర్భాటాన్ని చూపించుకునేందుకు రికార్డు స్థాయి లో ప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే కరెన్సీ నోట్లతో గణేష్ మండపాలను అలంకరించి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో మదిన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధుర నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని కరెన్సీ నోట్లతో నింపేశారు ఉత్సవ సమితి సభ్యులు. గత ఐదు సంవత్సరాలుగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తూ.. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా తమ ప్రత్యేకతను చాటుకుంటుంది మధుర నగర్ గణేష్ ఉత్సవ సమితి. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో వేల మందికి భక్తితో పాటు చాలామంది ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్క అలంకరణతో ఒక్కో విధంగా గణేష్ మండపాన్ని అలంకరిస్తున్నారు. అందులో భాగంగా 500 రూపాయల కరెన్సీ నోట్లతో గణేష్ మండపాన్ని నింపేశారు మధుర నగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. సుమారు పాతిక లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్లను మాలగా తయారు చేసి గణేష్ విగ్రహంతో పాటు గణేష్ మండపాన్ని కూడా అందంగా అలంకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మధుర నగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన మండపానికి వచ్చి భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించటం తో పాటు తాము చుసిన కాస్ట్లీ గణేష్ మండపం ఇదేనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులను అధిక సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో ఏదో ఒక ప్రత్యేక తో ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రతిరోజు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ వివిధ ప్రత్యేకతలతో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల్లో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడి మండపం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..