Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ.. కోతులు కొత్తగా కొలువు చేస్తున్నాయా ఏంటీ..? రైల్వే ఉద్యోగి అవతారం ఎత్తిన వానరం.. ఏం చేసిందంటే..

ఆ వీడియోలో ఓ కోతి ఎవరూ లేని సమయం చూసి రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే ఎంక్వైరీ ఆఫీసులో దూరింది..అక్కడ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం ప్రారంభించింది. చూస్తుంటే కోతి చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైల్వేలో కొత్త నియామకం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు.

Viral Video: వార్నీ.. కోతులు కొత్తగా కొలువు చేస్తున్నాయా ఏంటీ..? రైల్వే ఉద్యోగి అవతారం ఎత్తిన వానరం.. ఏం చేసిందంటే..
Angur Using Computer Keyboa
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2023 | 5:15 PM

కోతి నుంచే మనిషి పుట్టాడని అంటారు. అందుకే మనిషుల తర్వాత అంతటి జీవులు కూడా కోతులే అని చెబుతారు. కోతులు చాలా వరకు మనుషులలానే ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు ఇవి మనుషులు చేస్తున్న పనులు కూడా అనుకరిస్తుంటాయి. సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే చూశాం. ఇంటర్నెట్‌లో వానర చేష్టలకు సంబంధించి అనేక రకాలైన వీడియోలు, ఫన్నీ ఇన్సిడెంట్లు.. చాలానే వైరల్‌ అవుతుంటాయి. కోతులకు సంబంధించి ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి. కొన్ని సందర్భాల్లో మనల్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చొని ఒక డెడికేటెడ్ ఎంప్లాయ్ లాగా పని చేస్తూ ఉండడం కనిపించింది. ఈ కోతి కంప్యూటర్ ముందు మనిషిలాగా కూర్చుని కీబోర్డ్ పై టైప్ చేయడం చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. he_heavy_locopilot అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ కోతి వీడియో షేర్ చేయగా, ఇప్పుడది విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కోతి ఎవరూ లేని సమయం చూసి రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే ఎంక్వైరీ ఆఫీసులో దూరింది..అక్కడ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం ప్రారంభించింది. చూస్తుంటే కోతి చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైల్వేలో కొత్త నియామకం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా వీక్షణలను సంపాదించుకుంది. ఈ దృశ్యాన్ని అందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. అంతేకాదు చాలా మంది ఫన్నీగా రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఈ దృశ్యం వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 1.2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 87 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ కోతికి శాలరీగా ఎన్ని అరటి పళ్లు ఇస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. అయితే, మరికొందరు ఇలా అంటున్నారు..చాలా మంది AI వల్ల ఉద్యోగాలు పోతాయనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు కోతులు కూడా పోటీకి వస్తున్నాయా..? అంటూ ఫన్నీగా అడుగుతున్నారు. ఈ కోతికి గ్రేడ్ పే ఎంత అంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..