Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. కోవిడ్ కంటే ఘోరమైన అంటువ్యాధి.. కనీసం 5 కోట్ల మందిని చంపుతుంది!

శాస్త్రవేత్తలు 25 వైరస్ కుటుంబాలను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్‌లు ఉన్నట్టుగా నిర్ధారించారు. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల అధ్యయనం చేయని వైరస్‌లు కూడా అనేకం ఉన్నాయన్నారు.

Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. కోవిడ్ కంటే ఘోరమైన అంటువ్యాధి.. కనీసం 5 కోట్ల మందిని చంపుతుంది!
Disease X
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2023 | 4:37 PM

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం ఇంకా వెంటాడుతూనే ఉంది…అంతలోనే మరో పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి రాబోతోందని UK ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి డిసీజ్ X అని పేరు పెట్టింది. మే నుండి డిసెంబర్ 2020 వరకు UK వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చైర్‌గా పనిచేసిన కేట్ బింగ్‌హామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, కొత్త వైరస్ 1919-1920 నాటి వినాశకరమైన స్పానిష్ ఫ్లూ వంటి ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఈ వ్యాధి X వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఏదైనా కొత్త ఏజెంట్ కావచ్చు. దీనికి ఎలాంటి చికిత్సలు లేవని WHO తెలియజేసింది. కేట్ బింగ్‌హామ్ దీని గురించి తన ఆందోళనను వ్యక్తం చేశారు. 1918-19 ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మిలియన్లు అంటే 5 కోట్లు మందిని హరించింది. ఈ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇప్పటికే ఉన్న అనేక వైరస్‌లలో ఇది కూడా ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది అని కూడా చెప్పాడు. అంతేకాదు.. డిసీజ్‌ ఎక్స్‌ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని ఆరోగ్య పరిశోధకులు హెచ్చరించారు.

ఇప్పుడు, ప్రపంచం డిసీజ్ X భయాన్ని ఎదుర్కోవాలంటే,..ప్రపంచం సామూహిక టీకా డ్రైవ్‌లకు సిద్ధం కావాలన్నారు. రికార్డు స్థాయిలో మోతాదులను అందించాలన్నారు. శాస్త్రవేత్తలు 25 వైరస్ కుటుంబాలను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్‌లు ఉన్నట్టుగా నిర్ధారించారు. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల అధ్యయనం చేయని వైరస్‌లు కూడా అనేకం ఉన్నాయన్నారు.

అయితే నిపుణులు ఒక జాతి నుండి మరొక జాతికి దూకగల మిలియన్ కంటే ఎక్కువ తెలియన వైరస్‌ రకాలు ఉండవచ్చని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్-19 కొంతవరకు తక్కువ ప్రభావానే చూపించిందన్నారు.. ఇది ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లు (2 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ మరణాలకు కారణమైనప్పటికీ, వైరస్ సోకిన వారిలో అత్యధికులు కోలుకున్నారు. కానీ, డిసీజ్ Xని ఊహించటం కష్టంమన్నారు. ఇది ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధిని మించిందన్నారు. ప్రపంచంలో ఎక్కడో ఇప్పటికే ఇది పంజా విసురుతుందని, దాని విజృంభణ ఎలా ఉంటుందో కూడా చెప్పలేమన్నారు.

ఇవి కూడా చదవండి

ఎబోలా మరణాల రేటు సుమారు 67 శాతం, మరియు బర్డ్ ఫ్లూ, MERS కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. కాబట్టి మనం ఖచ్చితంగా తదుపరి మహమ్మారిని సులభంగా అరికట్టలేమన్నారు. అందువల్ల అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన భాద్యత ప్రజలందరిదీ అని చెప్పారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..