బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఈ డ్రింక్స్ అలవాటు చేసుకోండి.. పొట్ట, తొడలు, నడుములో పేరుకున్న కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
ప్రతి రోజు ఉదయాన్నే ప్రారంభించే మీ దినచర్య మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి పగలు, రాత్రి ఆకలితో మాడాల్సిన అవసరం లేదు. డైటింగ్, జిమ్‌లో గంటల తరబడి చెమటొర్చాల్సిన అవసరం అలసలే లేదు. బెల్లీ ఫ్యాట్ సహజంగా కరిగిపోతుంది. దీని కోసం మీరు ఈ 7 బరువు తగ్గించే పానీయాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే సరిపోతుంది.
చాలా మంది బరువు తగ్గడాన్ని ఒక ఛాలెజింగ్ చేస్తుంటారు. బరువు తగ్గడానికి జీవనశైలి మార్పులు ముఖ్యమైనవి. ఉదయాన్నే మీరు తినేవాటిని, తాగేవాటిలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతి రోజు ఉదయాన్నే ప్రారంభించే మీ దినచర్య మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి పగలు, రాత్రి ఆకలితో మాడాల్సిన అవసరం లేదు. డైటింగ్, జిమ్‌లో గంటల తరబడి చెమటొర్చాల్సిన అవసరం అలసలే లేదు. బెల్లీ ఫ్యాట్ సహజంగా కరిగిపోతుంది. దీని కోసం మీరు ఈ 7 బరువు తగ్గించే పానీయాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే సరిపోతుంది.
గోరువెచ్చని నిమ్మరసం..
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది హైడ్రేషన్, విటమిన్ సి అందిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
పసుపు, నల్ల మిరియాలు కలిపిన నీళ్లు..
పసుపు, నల్ల మిరియాలు ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరుకుతాయి. పసుపు కర్కుమిన్‌ని అందిస్తుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అదే సమయంలో, నల్ల మిరియాలు జీవక్రియను పెంచడం ద్వారా కొవ్వును కాల్చడానికి పని చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
దాల్చిన చెక్క టీ..
మీరు ప్రతిరోజూ తాగే సాదా టీ కంటే.. దాల్చిన చెక్క టీ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సమస్యలు నయమవుతాయి. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీ కెఫిన్, యాంటీఆక్సిడెంట్లను అందించే తక్కువ కేలరీల పానీయం. కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును వేగంగా కరిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే యాంటీఆక్సిడెంట్లు కడుపు, శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది EGCG అనే క్యాటెచిన్‌ను కూడా అందిస్తుంది. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చియా సీడ్ వాటర్..
బరువు తగ్గడంతో పాటు, ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి పెరిగి త్వరగా బరువు తగ్గుతారు. చియా సీడ్ వాటర్ తాగడం వల్ల మీకు ప్రోటీన్ అందుతుంది. ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
అలోవెరా జ్యూస్..
మీరు ఊబకాయం, IBS, అధిక రక్త చక్కెర, బలహీనమైన రోగనిరోధక శక్తితో పోరాడుతున్నట్లయితే, ఉదయాన్నే కలబంద రసం తాగడం మంచిది. ఈ జ్యూస్ అనేక అనారోగ్య సమస్యలన్నింటినీ నయం చేస్తుంది. అయితే ఈ జ్యూస్‌ని సరైన మోతాదులో మాత్రమే తాగండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..