Sprout Salad: మొలకలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ప్రతి రోజూ దీన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తినడం ఖాయం..
Sprout Salad: అల్పాహారంలో భాగంగా మొలకలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొలకెత్తిన వివిధ రకాల విత్తనాలు, గింజలతో పాటు టమాటో, ఉల్లిపాయలు, మిరపకాయలు, నిమ్మకాయ వంటివాటితో చేసే స్ప్రౌట్ సలాడ్ ప్రయోజనాలు అయితే అమితం. అసలు మొలకలను తీసుకుంటే కలిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 26, 2023 | 3:12 PM

Sprout Salad: పెసలు, శనగలు, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, మిరపకాయ, నిమ్మరసం వంటి పలు పదార్థాలు వేసి తయారు చేసే స్ప్రౌట్ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.

షుగర్ కంట్రోల్: ఉదయం వేళ అల్పాహారంగా మొలకలను తీసుకోవడం చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయి కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. ఇందులోని పోషకాలు అందుకు ఎంతగానో సహాయపడతాయి.

జీర్ణక్రియ: మొలకల్లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాక మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహార ఎంపిక. మొలకల సలాడ్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక ఆకలిని కూడా నియంత్రించి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఎముకల బలం: ముందుగా చెప్పుకున్నట్లు స్ప్రౌట్ సలాడ్‌లో అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. ఇందులోని విటమిన్స్, మినరల్స్, యాంటీయాక్సిడెంట్లు ఆరోగ్యాన్నే కాక ఎముకల బలాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకల మధ్య ఖాళీ కూడా తొలగిపోతుంది.





























