Viral Video: ఆటో నెంబర్ ప్లేట్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఆటోని ఎవరూ దొంగలించకుండా కావలా అంటున్న నెటిజన్లు..
వైరల్ అయిన ఈ వీడియోలో ఆటో వెనుక భాగంలో పాము చుట్ట చుట్టుకుని వేలాడుతుంది. అదే సమయంలో ఆ పాము పడగ విప్పి తనకు దగ్గరకు వచ్చిన వారిని కాటు వెయ్యడానికి రెడీగా ఉంది. అటువంటి పరిస్థితిలో, పాము దగ్గరికి వెళ్ళడానికి ఎవరో ప్రయత్నించగా అతనిపై ఉత్సాహంగా దాడి చేయ ప్రయత్నించింది. పడగ విప్పి ఆటో నంబర్ ప్లేట్‌కు చుట్టుకుని వీడియో తీస్తున్న వ్యక్తిని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది.

పాములు సర్వసాధారంగా ప్రతి చోటా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో .. అడవి సమీప ప్రాంతాల్లో ఎక్కువగా రకరకాల పాములు కనిపిస్తాయి. అయితే పాములు నగరాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి.. కానీ అవి గ్రామాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కోసారి వీధుల్లో, ఒక్కోసారి ఎవరి ఇంట్లోనైనా పాములు కనిపిస్తూ ప్రజల భయభ్రాంతులకు గురు చేస్తూ ఉంటాయి. ఇంట్లో చేరుకున్న పాములను బయటకు పంపించెయ్యడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంట్లోని పాములు బయటకు రాకపోతే.. వాటిని బలవంతంగా చంపేయడం లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం లేదా పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడం చాలా సార్లు జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియో ప్రజలను అప్రమత్తం చేసింది.
వైరల్ అయిన ఈ వీడియోలో ఆటో వెనుక భాగంలో పాము చుట్ట చుట్టుకుని వేలాడుతుంది. అదే సమయంలో ఆ పాము పడగ విప్పి తనకు దగ్గరకు వచ్చిన వారిని కాటు వెయ్యడానికి రెడీగా ఉంది. అటువంటి పరిస్థితిలో, పాము దగ్గరికి వెళ్ళడానికి ఎవరో ప్రయత్నించగా అతనిపై ఉత్సాహంగా దాడి చేయ ప్రయత్నించింది. పడగ విప్పి ఆటో నంబర్ ప్లేట్‌కు చుట్టుకుని వీడియో తీస్తున్న వ్యక్తిని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము అతనిపై దాడి చేసిన వెంటనే అతను వెంటనే వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఈ పాము అతన్ని కాటేస్తే, అతని ప్రాణాపాయంలో పడేవాడు. ఆటోకి చుట్టుకున్న నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాముల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. పామును చూసేందుకు స్కూలు పిల్లలు ఎలా గుమిగూడారో మీరు చూడవచ్చు.
వీడియో చూడండి
View this post on Instagram
మనసును కదిలించే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో d_shrestha10 అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 25 వేలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా.. వందలాది మంది వీడియోను లైక్ చేసారు. వివిధ కామెంట్‌లను పోస్ట్ చేసారు. ప్రతిస్పందనలు కూడా వచ్చాయి.
ఇది దిగ్భ్రాంతికరమైన దృశ్యమని కొందరు, ఈ ఆటోను ఎవరూ దొంగిలించకుండా పాము కాపలాగా మారిందని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో లొకేషన్‌ను వెల్లడించలేదు. అయితే ఆటో నంబర్ ప్లేట్‌ను పరిశీలిస్తే అది జార్ఖండ్‌కు చెందినది అయి ఉంటుందని తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..