AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. జ్యువెలరీ షోరూంలో ఏకంగా రూ.25 కోట్ల నగలు ఎత్తుకెళ్లిన దొంగలు..

సెప్టెంబర్ 25న హర్యానాలోని అంబాలాలో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది. అక్కడి సహకార బ్యాంకులోకి చొరబడిన దొంగలు నగలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. బ్యాంకులోకి ప్రవేశించేందుకు గ్యాస్ కట్టర్‌తో గోడకు రంధ్రం చేసి 32 లాకర్లను పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు. వారాంతానికి బ్యాంకు మూసి ఉండడంతో సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. జ్యువెలరీ షోరూంలో ఏకంగా రూ.25 కోట్ల నగలు ఎత్తుకెళ్లిన దొంగలు..
Jewellery Shop
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2023 | 6:54 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ జరిగింది. నగల దుకాణంలో బీభత్సం సృష్టించిన దుండగులు రూ.20 నుంచి 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యారు. దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పూర్ సమీపం భోగాల్‌ ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్‌ జ్యూయలరీ దుకాణంలో జరిగింది ఈ భారీ చోరీ. ఉమ్రావ్ జ్యువెలర్స్‌లో కోట్లాది రూపాయల దోపిడీ జరగడం దేశ రాజధానిని షేక్‌ చేసింది. సీసీటీవీలతో పాటు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ భారీ దోపిడీ జరగటం పట్ల వ్యాపారులతో పాటు స్థానికుల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది.

భారీ దోపిడీకి పక్కా ప్లాన్‌తో దిగిన దొంగల ముఠా ముందుగా జ్యువెలరీ షాపు సీసీటీవీలను డిస్‌కనెక్ట్ చేసింది. ఆపై టెర్రస్ నుండి 4 అంతస్తుల భవనంలో ఉన్న ఈ నగల దుకాణంలోకి ప్రవేశించారు.. తర్వాత మెట్లు దిగి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకున్నారు.. అక్కడ ఓ జ్యువెలరీ షాపు స్ట్రాంగ్‌ రూం ఉందని వారు ముందుగానే తెలుసుకున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు దాని గోడకు పెద్ద కన్నం వేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన కోట్లాది రూపాయల విలువైన నగలు మొత్తం మూటగట్టేశారు. దాంతో పాటు షోరూంలో కస్టమర్లు చూసేందుకు అందుబాటులో ఉంచిన నగలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ప్రతి సోమవారం దుకాణానికి సెలవు కావడంతో ఆదివారం సాయంత్రమే షోరూంకు తాళాలు వేసి వెళ్లిపోయారు షోరూం యజమాని, సిబ్బంది. తిరిగి మంగళవారం అంటే సెప్టెంబర్ 26న ఉదయం యథావిధిగా షో రూమ్‌ తెరిచేందుకు వచ్చారు. షాపు తెరిచిన సిబ్బంది, చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు జ్యులవెరీ షోరూమ్‌ని సందర్శించారు. చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరా పుటేజ్‌ని సేకరించి పరిశీలిస్తున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి క్లూ లభించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిసింది.

ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 25న హర్యానాలోని అంబాలాలో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది. అక్కడి సహకార బ్యాంకులోకి చొరబడిన దొంగలు నగలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. బ్యాంకులోకి ప్రవేశించేందుకు గ్యాస్ కట్టర్‌తో గోడకు రంధ్రం చేసి 32 లాకర్లను పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు. వారాంతానికి బ్యాంకు మూసి ఉండడంతో సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..