Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురు అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పటికీ ఆగడం లేదు. ఆ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి కార్యకలాపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఆరుగురిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇందులో అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది ఉగ్రవాదులు.. పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు జరిపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఆర్మీ సిబ్బంది కలిసి రంగంలోకి దిగాయి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పటికీ ఆగడం లేదు. ఆ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి కార్యకలాపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఆరుగురిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇందులో అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది ఉగ్రవాదులు.. పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు జరిపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఆర్మీ సిబ్బంది కలిసి రంగంలోకి దిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు . ఈ క్రమంలోనే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని గుర్తించారు. ఆరుగురుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు వారి నుంచి మూడు తుపాకీలు, ఐదు హ్యాండ్ గ్రనేడ్లు సైతం స్వాధీనం చేసుకున్నారు.
‘మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని.. వారిలో యాక్టివ్ టెర్రరిస్ట్‌గా ఉన్న యాసిర్ అహ్మద్ షా కూడా ఉన్నాడని బారాముల్లా సీనియర్ ఎస్పీ అమోక్ నాగ్‌పురే పేర్కొన్నారు. అలాగే మిగతా అయిదుగురు కూడా అతడికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకరు మైనర్ కూడా ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ తాజా అరెస్టుల కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. అయితే సరిహద్దు నుంచి అక్రమ ఆయుధాల దిగుమతికి కూడా అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు. యాసిర్ అహ్మద్ షా అరెస్టు తర్వాత అతడికి సాయం చేస్తున్నటువంటి వ్యక్తుల సమాచారం కూడా తెలిసిందని తెలిపారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఆలోచనతో మహిళలతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లైతే మహిళలు, మైనర్లు అనే తేడా అనేది చూడమని ఘాటుగా హెచ్చరించారు ఎస్పీ అమోక్ నాగ్‌పురే .
ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా ఎన్‌కౌంటర్ జరిగడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల్లో ఉగ్రవాదులు.. నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలను బలి తీసుకున్నారు. మరోవిషయం ఏంటంటే మృతుల్లో ముగ్గురు అధికారులు ఉండటం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటన జరిగిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై ఫోకస్ పెట్టాయి. అంతేకాదు పలు చోట్ల కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అనంతనాగ్‌లోని ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భద్రతను సమీక్షించేందుకు సోమవారం ఓ కోర్ గ్రూప్ సైతం భేటీ అయ్యింది. పోలీస్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే విషయంపై వారు చర్చలు జరిపారు.