Chhattisgarh: తన మనవడితో కలిసి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న 93 ఏళ్ల వృద్ధుడు..

ఎన్నో సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలో హెడ్కో పేరుని చేర్చలేదు. బహుశా అతని పత్రాలలోని తప్పుల వల్ల ఓటరు జాబితా నుండి అతని పేరుని మినహాయించి ఉండవచ్చు.  అయితే ఇప్పుడు తన పేరుని ఓటర్ల జాబితాలో చేర్చడంతో ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నాడు షేర్ సింగ్. తాను తనకు నచ్చిన వ్యక్తికీ ఓటు వేస్తానని అస్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే వృధాప్యంతో షేర్ సింగ్ స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. 

Chhattisgarh: తన మనవడితో కలిసి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న 93 ఏళ్ల వృద్ధుడు..
Sher Singh Hedko
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2023 | 10:34 AM

ఓటు ప్రతి భారతీయుడి ప్రాధమిక హక్కు. తమకు నచ్చిన తాము మెచ్చిన రాజకీయనాయకుడిని తమ పాలకుడిగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఓటు ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశంలో 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులకు ఓటు వేసే హక్కు లభిస్తుంది.  అయితే 93 ఏళ్ల వయసులో తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నాడు ఓ వృద్ధుడు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో 93 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో తొలిసారిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  తన ఓటు హక్కును వినియోగించుకోనున్నాడు. భానుప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భైంసాకన్హర్ (కె) గ్రామానికి చెందిన షేర్ సింగ్ హెడ్కో (93) కు ఇటీవలే ఓటు లభించింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్లా నేతృత్వంలో చేపట్టిన ఇంటింటికీ ప్రచార సమయంలో షేర్ సింగ్ తన పేరుని ఓటర్ల జాబితాలో  నమోదు చేసుకున్నాడు.

ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్న షేర్ సింగ్

ఎన్నో సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలో హెడ్కో పేరుని చేర్చలేదు. బహుశా అతని పత్రాలలోని తప్పుల వల్ల ఓటరు జాబితా నుండి అతని పేరుని మినహాయించి ఉండవచ్చు.  అయితే ఇప్పుడు తన పేరుని ఓటర్ల జాబితాలో చేర్చడంతో ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నాడు షేర్ సింగ్. తాను తనకు నచ్చిన వ్యక్తికీ ఓటు వేస్తానని అస్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే వృధాప్యంతో షేర్ సింగ్ స్పష్టంగా మాట్లాడలేకపోయాడు.

ఓటరు అవగాహన ప్రచారం

జిల్లాలో ప్రస్తుతం ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, గతంలో ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన అర్హులైన వ్యక్తుల పేర్లను తిరిగి నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే షేర్ సింగ్ మనవడి పేరు నమోదు చేయడానికి వెళ్లిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) రాజేంద్ర కోస్మా.. ఓటరు జాబితాలో షేర్ సింగ్ పేరు కూడా లేదని..  అతను ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటు వేయలేదని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే మనవడితో పాటు తాతని కూడా ఓటరు జాబితాలో  అవసరమైన ప్రక్రియల ద్వారా చేర్చారు.

ఇవి కూడా చదవండి

కాంకేర్ జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ, “కొన్ని కారణాల వల్ల ఓటర్ల జాబితాలో లేని పేర్లను వారి ఇంటి దగ్గరకు వెళ్లి చేర్చుతున్నామని.. ఈ కార్యక్రమంలో భాగంగానే 93 ఏళ్ల వృద్ధుడైన షేర్ సింగ్ హెడ్కో పేరు ఓటర్ల జాబితాలో లేనట్లు గుర్తించామని ఇప్పుడు అతని పేరు నమోదు చేశామని పేర్కొన్నారు.

అంతేకాదు అంతగఢ్ , భానుప్రతాపూర్ బ్లాక్‌లలో పలువురు సీనియర్ సిటిజన్ల పేర్లు ఈసారి ఓటరు జాబితాలో చేర్చారు. ఈ సానుకూల మార్పుకు కారణం బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్‌ఓలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఇఆర్‌ఓలు), సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌విఇఇపి)కి బాధ్యత వహించే బృందం అంకితభావంతో చేసిన కృషే అని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. లో  90 మంది సభ్యుల అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్ శాసన సభ జనవరి 3న ముగియనుంది. 2018లో రాష్ట్రంలోని 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించగా, బీజేపీ 16 స్థానాలను కైవసం చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..