నకిలీ డాక్టర్ నిర్వాకం.. ఏసీ వేసుకుని నిద్రపోవడంతో ఇద్దరు నవజాత శిశువులు మృతి!

ఓ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యానికి ఇద్దరు నవ జాతశిశువుల ప్రాణాలు బలయ్యాయి. ఆసుపత్రిలో ఏసీ వేసుకుని డాక్టర్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రంతా ఏసీ చలికి తాళలేక ఇద్దరు నవజాత శిశువులు చనిపోవడంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డలు మరణించారని ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీలో సోమవారం (సెప్టెంబర్ 25) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నకిలీ డాక్టర్ నిర్వాకం.. ఏసీ వేసుకుని నిద్రపోవడంతో ఇద్దరు నవజాత శిశువులు మృతి!
Newborn
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2023 | 9:23 AM

లక్నో, సెప్టెంబర్‌ 26: ఓ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యానికి ఇద్దరు నవ జాతశిశువుల ప్రాణాలు బలయ్యాయి. ఆసుపత్రిలో ఏసీ వేసుకుని డాక్టర్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రంతా ఏసీ చలికి తాళలేక ఇద్దరు నవజాత శిశువులు చనిపోవడంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డలు మరణించారని ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీలో సోమవారం (సెప్టెంబర్ 25) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీ జిల్లాలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు సెప్టెంబర్‌ 23వ తేదీన జన్మించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు అదే రోజు శిశువులకు మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ క్లినిక్‌కు తరలించారు. సదరు ఆసుపత్రిలోని ఫొటో థెరపీ వార్డులో శిశువులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే వార్డులో విధులు నిర్వహిస్తోన్న డాక్టర్‌ నీతు కుమార్ (38) పిల్లలను పట్టించుకోపోగా.. ఏసీ వేసుకుని రాత్రంతా నిద్రపోయాడు. డాక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది కూడా గుర్రు పెట్టినిద్రపోయారు. ఆదివారం ఉదయం శిశువులను చూసేందుకు వార్డులోకి వెళ్లిన తల్లిదండ్రులకు శిశువులు విగతజీవులుగా కనిపించారు. దీంతో ఆగ్రహించిన శిశువుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే సదరు డాక్టర్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

దీనిపై సర్కిల్‌ ఆఫీసర్‌ అమర్‌దీప్‌ మౌర్య మాట్లాడుతూ.. మృతి చెందిన శిశువుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు డాక్టర్ నీతూ కుమార్‌పై ఐపీసీ సెక్షన్‌ 304, 420 కింద కైరానా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సదరు డాక్టర్‌ లైసెన్స్‌ లేకుండా ప్రైవేట్ క్లినిక్‌ నడుపుతున్నట్లు అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్ తెలిపారు. సంఘటన అనంతరం ఆసుపత్రిలో సోదాలు నిర్వహించగా ఎలాంటి మెడికల్‌ డిగ్రీ, లైసెన్స్‌ లేకుండా నీతూ కుమార్‌ డాక్టర్‌గా చలామని అవుతున్నట్లు గుర్తించారు. దీంతో నిందితుడు నడుపుతోన్న ప్రైవేట్‌ క్లినిక్‌ను సీజ్‌ చేసి, ఇండియన్‌ మెడికల్ యాక్ట్‌ 1956లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..