AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neera Cafe in Hyderabad:15 ఏళ్ల లీజుకు నీరా కేఫ్‌ ఇస్తామంటూ టెంటర్లు పిలుస్తోన్న సర్కార్‌.. 4 నెలలే నిర్వహణ!

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా రూ.16 కోట్లతో స్టార్‌ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్‌ను పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించింది. అయితే దీనిని ఏర్పాటు చేసి పట్టు మని నాలుగు నెలలు గడిచాయో.. లేదో అప్పుడే లీజుకు ఇస్తామంటూ టెండర్లు పిలవడం చర్చనీయాంశమైంది. అదీ ఒకటీ రెండేళ్లే కాకుండా ఏకంగా పదిహేనేళ్లు ప్రైవేటుకు అప్పగించే పనిలో పడింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి..

Neera Cafe in Hyderabad:15 ఏళ్ల లీజుకు నీరా కేఫ్‌ ఇస్తామంటూ టెంటర్లు పిలుస్తోన్న సర్కార్‌.. 4 నెలలే నిర్వహణ!
Neera Cafe At Necklace Road
Srilakshmi C
|

Updated on: Sep 25, 2023 | 7:46 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా రూ.16 కోట్లతో స్టార్‌ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్‌ను పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించింది. అయితే దీనిని ఏర్పాటు చేసి పట్టు మని నాలుగు నెలలు గడిచాయో.. లేదో అప్పుడే లీజుకు ఇస్తామంటూ టెండర్లు పిలవడం చర్చనీయాంశమైంది. అదీ ఒకటీ రెండేళ్లే కాకుండా ఏకంగా పదిహేనేళ్లు ప్రైవేటుకు అప్పగించే పనిలో పడింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాగా నీరా కేఫ్‌ను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్సైజ్‌శాఖ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. దీనిని ఈ ఏడాది (2023) మేలో లాంఛనంగా ప్రారంభించారు. అప్పట్నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే నీరా కేఫ్‌ నడుస్తోంది.

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్నీ నీరా కేఫ్‌లో ఒకే సారి దాదాపు 500 మంది కూర్చునే ఏర్పాట్లు చేశారు. ఈ కేఫ్‌కు రోజూ దాదాపు వెయ్యి మందికిపైగా కస్టమర్లు వస్తుంటారు. గీత కార్మిక సంఘాల నుంచి నీరాను కొనుగోలు చేసి ఈ కేఫ్‌లో కస్టమర్లకు పంపిణీ చేస్తారు. గీత కార్మికులకు రవాణా ఖర్చులతో కూడా కలిపి లీటర్‌కు రూ.200కిపైగా చెల్లించి నీరాను కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన నీరా ఒక లీటరు నీరాను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయలు లాభం గడిస్తోంది కూడా. అయితే.. నీరా కేఫ్‌పై భారీ మొత్తాన్ని ఖర్చుచేసి, ఇప్పుడు నాలుగు నెలలకే లీజుకిచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లీజు ప్రాథమిక ధర నెలకు రూ.లక్షగా ఖరారు చేశారు. ఈ మేరకు టూరిజం కార్పొరేషన్‌ టెండర్లు ఆహ్వానిస్తోంది. మరోవైపు నీరా అమ్మే సొసైటీలు రాష్ట్రంలో ఉన్నాయని, అలా రిజిస్టర్‌ అయిన సొసైటీలకే కేఫ్‌ లీజు పొందే అర్హత ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నేడు, రేపు (సోమ, మంగళ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సూచించింది. తూర్పు, ఉత్తర జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.