Cancelled Trains Today: నేటి నుంచి అక్టోబర్ 1 వరకు ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు
ల్వే లైన్ పనులు, సాంకేతిక కారణాల పేరుతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గుంటూరు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లవల్సిన పలు రైళ్లను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. రద్దైన రైళ్లలో కాచిగూడ - నడికుడి - కాచిగూడ (07791/07792) రైలు సర్వీసులు..
గుంటూరు, సెప్టెంబర్ 25: రైల్వే లైన్ పనులు, సాంకేతిక కారణాల పేరుతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గుంటూరు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లవల్సిన పలు రైళ్లను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. రద్దైన రైళ్లలో కాచిగూడ – నడికుడి – కాచిగూడ (07791/07792) రైలు సర్వీసులు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 1 వరకు రద్దు అవుతున్నాయి.
గుంటూరు – డోన్ – గుంటూరు (17228/17227), గుంటూరు – కాచిగూడ – గుంటూరు (17251/17252) రైలు, గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు (17253/17254).. ఈ మూడు రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు. అలాగే సెప్టెంబర్ 26, 28, 30 తేదీల్లో మచిలీపట్నం – మంత్రాలయం మధ్య నడిచే రైలు (07067) రద్దు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 27, 29, అక్టోబరు 1 తేదీల్లో మంత్రాలయం – మచిలీపట్నం మధ్య నడిచే రైలు (07068)ను రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం-తెనాలి (07890) రైలును మార్కాపురం నుంచి గుంటూరు మధ్య, రేపల్లె – మార్కాపురం (07889) రైలును గుంటూరు నుంచి మార్కాపురం మధ్య సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ నెల 1వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
విశాఖలో బయల్దేరిన గంటకే తిరిగొచ్చిన విమానం
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం గంటకే వెనక్కి తిరిగివచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 24) సాయంత్రం 5.30 గంటలకు విశాఖ పట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బయల్దేరిని గంటలకే అంటే 6.30 గంటలకు తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి ఆ విమానం తిరిగొచ్చింది. అదే విమానంలో ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంతనాయక్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని మరో విమానంలో రాత్రి 9.30 గంటలకు ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీకి పంపింది. విమానంలో మిగిలిన 165 మంది ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.