Pythons: కొండచిలువలను గంపలో పెట్టుకెళ్లి.. ఏంచేశారో తెలుసా.?  వీడియో వైరల్

Pythons: కొండచిలువలను గంపలో పెట్టుకెళ్లి.. ఏంచేశారో తెలుసా.? వీడియో వైరల్

Anil kumar poka

|

Updated on: Sep 25, 2023 | 8:19 AM

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొండచిలువ పేరు వింటే.. అమాంతం మింగేస్తుందని ఆమడదూరం పరుగెడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కొండచిలువలను తాళ్లను పట్టుకున్నట్టు పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ కొండ చిలువలు ఎక్కడో పట్టుబడ్డవి కూడా కాదు, విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవే.

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొండచిలువ పేరు వింటే.. అమాంతం మింగేస్తుందని ఆమడదూరం పరుగెడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కొండచిలువలను తాళ్లను పట్టుకున్నట్టు పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ కొండ చిలువలు ఎక్కడో పట్టుబడ్డవి కూడా కాదు, విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవే. ఒక ఇంట్లో కోడి పిల్లలు ఉన్న గంప కింద దూరి వాటిని తింటూ పట్టుబడ్డ కొండ చిలువ ఒకటైతే, చేపల వలలో ఒకటి, ఇంకోటి కొండ దిగువన ఉన్న ఇళ్లలోకి దూరిన పాము. ఇలా విశాఖ లో ఎక్కడ పాము కనిపించినా అక్కడ వాలిపోయి వాటిని బంధించి సురక్షితంగా అడవుల్లో వదిలిపెడతాడు స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌. ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న నాలుగు భారీ కొండచిలువలను సెప్టెంబర్‌ 22న స్టీల్ ప్లాంట్ కు, పరవాడ కు మధ్యనున్న ప్రాంతంలో వదిలేశారు. వాటిని వదిలే సందర్భంగా చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. విశాఖచుట్టూ కొండలు, అటవీ ప్రాంతాలు ఎక్కువ కావడంతో తరచూ ఇలా పాములు, కొండచిలువలు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..