Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak World Cup 2023 : పాకిస్తాన్‌ మ్యాచ్ లకు కష్టంకాలం.. రేట్లు తగ్గించినా అమ్ముడు పోని టికెట్లు.. షాక్‌లో నిర్వాహకులు..

Hyderabad: ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్లకు ఇప్పటికే టికెట్లను రిలీజ్ చేసినప్పటికీ బుక్ మై షో లో దాదాపు 50 శాతానికి పైగా టికెట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వచ్చే నల 5 నుండి భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ కు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా వరల్డ్ కప్ కి సంబంధించి మొత్తం ఐదు మ్యాచ్ లు జరగనున్నాయి. పాకిస్తాన్ మ్యాచ్ లు ఏకంగా నాలుగు ఇక్కడ..

Ind Vs Pak World Cup 2023 : పాకిస్తాన్‌ మ్యాచ్ లకు కష్టంకాలం.. రేట్లు తగ్గించినా అమ్ముడు పోని టికెట్లు.. షాక్‌లో నిర్వాహకులు..
Ind Vs Pak World Cup 2023
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 24, 2023 | 9:37 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 24; వచ్చే నెల 5 నుండి భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ కు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా వరల్డ్ కప్ కి సంబంధించి మొత్తం ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మప్ మ్యాచులు కాగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ న్యూజిలాండ్ల మధ్య జరిగే వార్మప్ మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు … ముందు రోజు గణేష్ నిమజ్జనం ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది బిసిసిఐ. ఇప్పటికే ఆ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం కొనసాగుతుంది.

అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్ లలో  రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ కి సంబంధించి ఉన్నాయి. ప్రపంచ కప్ ప్రారంభమైన రెండో రోజే ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది. అక్టోబర్ 6న ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 9న సైతం పాకిస్తాన్ శ్రీలంక మధ్య మరో మ్యాచ్ ఉప్పల్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లకు టికెట్ సేల్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.  బుక్ మై షో ద్వారా టికెట్లను రిలీజ్ చేసిన పెద్దగా టికెట్లు అమ్ముడుపోవడం లేదు. అందులోనూ నెదర్లాండ్స్ లాంటి దేశంతో మ్యాచ్ కావడంతో సాధారణంగానే ఈ మ్యాచ్ పై ఆసక్తి తగ్గింది. అంతో ఇంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న మ్యాచ్ అంటే సెప్టెంబర్ 29 అక్టోబర్ 3న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లే.

ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టీమ్లతో పాకిస్తాన్ ప్రాక్టీస్ మ్యాచ్లను ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.  29 మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్లు వెనక్కి ఇచ్చేందుకు బీసీసీఐ బుక్ మై షో ద్వారా రిఫండ్ ప్రాసెస్ ను ప్రారంభించింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్లకు సైతం టికెట్ సేల్స్ పెద్దగా అమ్ముడుపోవడం లేదు. టీమ్ ఇండియా ఆడే ఏ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం వేదిక కాదు.. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ కు పాకిస్తాన్ కు సంబంధించిన మ్యాచులు ఏకంగా నాలుగు హైదరాబాద్ లోనే పెట్టడంతో టికెట్ సేల్స్ మరింత పడిపోయాయి..ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్లకు ఇప్పటికే టికెట్లను రిలీజ్ చేసినప్పటికీ బుక్ మై షో లో దాదాపు 50 శాతానికి పైగా టికెట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. టీమ్ ఇండియా మ్యాచ్ లు ఇక్కడ లేకపోవడం, పాకిస్తాన్ మ్యాచ్ లు ఏకంగా నాలుగు ఇక్కడ నిర్వహించడమే కారణంగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..