Skin Care: ఈ ప్యాక్‌ ముందు ఫేషియల్స్‌ దండగే..! నిగనిగలాడే చర్మం మీ సొంతం.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు

అయితే, ముఖంపై మొటిమలు, మచ్చల సమస్యకు అనారోగ్య జీవనశైలి కూడా కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, మంచి ఆహారం తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు చర్మం డల్ గా కనిపిస్తుంది. మెరిసే చర్మం కోసం కొన్ని సింపుల్ చిట్కాలను ఇక్కడ చెప్పబోతున్నాం. ఇంట్లో ఉండే వస్తువులతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. దీని కోసం మీరు రాత్రి మిగిలిపోయిన రోటీని కూడా ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Skin Care: ఈ ప్యాక్‌ ముందు ఫేషియల్స్‌ దండగే..! నిగనిగలాడే చర్మం మీ సొంతం.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు
Hacks Of Skin Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2023 | 8:07 PM

మెరిసే చర్మం, అందమైన ముఖం కలిగి ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇందులో వేలకు వేలు ఖర్చు చేసిన బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. మార్కెట్లో చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి తక్కువ సమయంలోనే అందంగా మారిపోతుంటారు. అయితే, ఇది తాత్కాలికమైన ఆనందం మాత్రమే.. ఇలాంటి అందం కొంత సమయం వరకు మాత్రమే నిలుస్తుంది. ఆ తర్వాత చర్మం మళ్లీ నిర్జీవంగా, పొడిబారిపోయి కనిపిస్తుంది. అయితే, ముఖంపై మొటిమలు, మచ్చల సమస్యకు అనారోగ్య జీవనశైలి కూడా కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, మంచి ఆహారం తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు చర్మం డల్ గా కనిపిస్తుంది. మెరిసే చర్మం కోసం కొన్ని సింపుల్ చిట్కాలను ఇక్కడ చెప్పబోతున్నాం. ఇంట్లో ఉండే వస్తువులతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. దీని కోసం మీరు రాత్రి మిగిలిపోయిన రోటీని కూడా ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

దీనికి కావాల్సిన పదార్థాలు..

తేనె, పచ్చిపాలు, మిగిలిపోయిన రొట్టే ముక్కలు. మిగిలిపోయిన చపాతీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖ చర్మానికి మెరుపు వస్తుంది. మిగిలిపోయిన చపాతీని చర్మంపై అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలు తెరవబడతాయి. దీంతో డీప్ క్లెన్సింగ్ కూడా చేస్తుంది. స్కిన్ టానింగ్‌ను తొలగించడానికి కూడా ఈ రోటీ ట్రీట్‌ మెంట్ పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

– పచ్చి పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి..

పచ్చి పాలను అప్లై చేయడం వల్ల మన ముఖం తేమగా ఉండటమే కాకుండా చర్మానికి మెరుపునిస్తుంది. పచ్చి పాలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన చర్మానికి మేలు చేస్తుంది. పచ్చి పాలను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

– తేనె కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మీరు సహజంగా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలనుకుంటే, తేనె దీనికి అత్యంత ప్రయోజనకరమైనది. ముఖంపై లోతైన శుభ్రత కోసం తేనెను ఉపయోగిస్తారు. తేనెను అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలు కూడా శుభ్రపడతాయి.

– ఎలా ఉపయోగించాలంటే..

ముందుగా మిగిలిన రోటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలు, తేనె వేసి కలపాలి. మెత్తటి పెస్టుల తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీ ముఖంపై 10 నిమిషాలు అప్లై చేయండి. ఈ ఫేస్‌ ప్యాక్‌ను వారానికి 3 సార్లు అప్లై చేయవచ్చు. ఆ తర్వాత కనిపించే మార్పును మీరే గమనిస్తారు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?