AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra-pradesh: గోవిందరాజుల గుట్టపై శ్రీవారి పాదముద్రలు.. మట్టి తవ్వకాల్లో బయట పడ్డ అద్భుతం..!

Chittoor: చిత్తూరు సమీపంలోని పెనుమూరు మండలం కలికిరి కొండపై రెండు పాదాలు మోపి కలిపురుషున్ని శ్రీవారు పాతాళంలోకి తొక్కినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గోవిందుని గుట్ట పై శ్రీవారి పాద ముద్రలు ఉన్నట్లు భావించి పూర్వికులు పూజలు నిర్వహించే వారని చెబుతున్న స్థానికులు.. ఇప్పుడు తవ్వకాల్లో శ్రీవారి పాదముద్రలు బయట పడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కృపకు పాత్రులయ్యా మంటున్నారు. 

Andhra-pradesh: గోవిందరాజుల గుట్టపై శ్రీవారి పాదముద్రలు.. మట్టి తవ్వకాల్లో బయట పడ్డ అద్భుతం..!
Srivari Padalu
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 24, 2023 | 8:52 PM

Share

చిత్తూరు-తచ్చూరు హైవే పనులు జరుగుతుండగా, మట్టి తవ్వకాల్లో అద్భుతం చోటు చేసుకుంది. గోవిందరాజుల గుట్టపై మట్టి తవ్వకాలు చేపడుతుండగా శ్రీవారి పాదముద్రలు బయటపడ్డాయి. దీంతో చుట్టుపక్కల 40పల్లెల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చిత్తూరు జిల్లాలో హైవే నిర్మాణ పనుల కోసం చేపట్టిన మట్టి తవ్వకాలు శ్రీవారి పాదముద్రల ఆనవాళ్లు బయటపడ్డాయి. గోవిందరాజుల గుట్టగా పిలిచే ప్రాంతంలో మట్టి కోసం చేపట్టిన తవ్వకాలు శ్రీవారి పాదముద్రల గుర్తులను బయట పెట్టిందన్న చర్చకు తెరతీసింది. దీంతో శ్రీవారి పాదముద్రలపై ఇప్పుడక్కడ పెద్ద చర్చే నడుస్తోంది. 10 పంచాయితీల పెద్దలను ఒక్కటి చేసింది. గోవిందరాజుల గుట్టపై దర్శనమిచ్చిన శ్రీవారి పాదముద్రల ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలన్న నిర్ణయాన్ని వచ్చేలా చేసింది.

– 40 పలెల్లో ఇదే చర్చ..

శ్రీవారి పాద ముద్రలపై ఇప్పుడు చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు వద్ద జనంలో ఆసక్తికర చర్చ మొదలైంది. చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని టి. వేపనపల్లి లోని గోవిందుని గుట్టలో శ్రీవారి పాదముద్రలు దర్శనమిచ్చాయన్న సమాచారం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు విస్తరించింది. చిత్తూరు-తచ్చూరు హైవే నిర్మాణ పనులు కోసం మట్టి తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్ గుట్ట నుంచి మట్టిని తరలించే సమయంలో పాదముద్రలు ఆనవాళ్లు బయట పడ్డాయి. మట్టి తవ్వకం పనులు చేస్తుండగా పరిశీలించేందుకు వెళ్లిన స్థానికులు శ్రీవారి పాద ముద్రలు ఉండడాన్ని గుర్తించి పూజలు నిర్వహించారు. పూర్వికులు చెప్పినట్టుగా గోవిందరాజుల గుట్టపై సాక్షాత్తు శ్రీవారే పాదం మోపినట్లు భావిస్తున్నారు. ఈమేరకు ఆలయ నిర్మాణానికి సమీపంలోని 40 పల్లెల్లోని ప్రజలు ట్రస్ట్ గా ఏర్పాటు అయి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

–  గోవిందుని గుట్టపై గుడి నిర్మాణానికి శ్రీకారం.

వేపనపల్లి సమీపంలోని గోవిందుని గుట్టలో శ్రీవారు పాదముద్రల ఆనవాళ్ళ పై అంతటా చర్చ జరుగుతుండటంతో ఈ గోవిందుని గట్ట కు ప్రాధాన్యత సంతరించుకుంది. పురాణలు, ఐతిహాలు ప్రకారం గోవిందన్ గుట్ట గా కూడా పిలిచే ప్రాంతంలో శ్రీవారి పాదముద్రలు ఇప్పుడు కనిపించడంతో స్థానికులు పూజలు చేస్తూ మొక్కులు తీర్చు కుంటున్నారు. పాతికేళ్ల క్రితం ప్రముఖ కవి, ప్రస్తుతం చిత్తూరు జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి రచించిన కవితల్లోనూ గోవిందుని గుట్ట ప్రస్తావన ఉంది. శ్రీవారి పాదముద్రల కవితల్లో ప్రస్తావన ఇప్పుడు చర్చ గా మారింది. కలియుగంలో కలిపురుషున్ని అంతం చేసేందుకు శ్రీవారు మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని బంగారు తిరుపతిలో మొదటి అడుగు మోపి రెండవ అడుగు గోవిందుని గుట్టపై కుడికాలు మోపినట్లు పురాణ కథలోని అంశాలను స్థానికులు గుర్తు చేస్తున్నారు. చిత్తూరు సమీపంలోని పెనుమూరు మండలం కలికిరి కొండపై రెండు పాదాలు మోపి కలిపురుషున్ని శ్రీవారు పాతాళంలోకి తొక్కినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గోవిందుని గుట్ట పై శ్రీవారి పాద ముద్రలు ఉన్నట్లు భావించి పూర్వికులు పూజలు నిర్వహించే వారని చెబుతున్న స్థానికులు.. ఇప్పుడు తవ్వకాల్లో శ్రీవారి పాదముద్రలు బయట పడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కృపకు పాత్రులయ్యా మంటున్నారు.

ఇవి కూడా చదవండి

– పాదాలపై గొడుకు ప్రతిష్టాపన..

మరోవైపు ఏడుకొండల్లో ఎత్తైన కొండ నారాయణగిరి శిఖరం కాగా కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడు తొలి అడుగు మోపింది ఇక్కడేనని పురాణాల చరిత్ర చెబుతోంది. ఎత్తైన శిఖరం పై గాలుల తీవ్రత పై ఉపశమనం కల్పించేందుకు వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఇప్పటికీ అర్చక బృందం గొడుగును ప్రతిష్టిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా