AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దిశ పోలీసులనే టెస్ట్ చేసిన మహిళ… కిడ్నాప్ పేరుతో ఫోన్ చేసి హడలెత్తించింది.. ట్విస్ట్‌ ఏంటంటే..

Guntur: దీంతో సిబ్బంది ఆ సమాచారాన్ని స్తానిక నల్లపాడు పోలీస్ స్టేషన్ కు అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నంబర్ ను ట్రేస్ చేశారు. ఆ ఫోన్ నంబర్ ఉన్న ఫోన్ ఆటోలో ఉన్నట్లు, అది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ను జిపిఎస్ ద్వారా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కానిస్టేబుల్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ ఆటోను గుర్తించి దాన్ని చేజ్ చేశారు. కొద్దీ దూరం పోయిన వెంటనే ఆటోను నిలిపి వేశారు.

Andhra Pradesh: దిశ పోలీసులనే టెస్ట్ చేసిన మహిళ... కిడ్నాప్ పేరుతో ఫోన్ చేసి హడలెత్తించింది.. ట్విస్ట్‌ ఏంటంటే..
Police Station in Nallapadu,Guntur
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 24, 2023 | 5:22 PM

గుంటూరు, సెప్టెంబర్24; మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ ఎస్ఓఎస్ యాప్‌ను తీసుకొచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఆ మహిళను రక్షించేవారు. గత కొన్నేళ్లుగా ఈ యాప్ లో కంప్లైంట్ చేసిన వెంనటే స్పందించిన పోలీసులు అనేక మందిని కాపాడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే దిశ యాప్ లో వచ్చిన ఫిర్యాదు పోలీసులనే హడలెత్తించింది. అసలేం జరిగిందంటే…

గుంటూరు నగరంలోని నల్లపాడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన పోలీసులను హడలెత్తించింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దిశ యాప్ కు ఒక వీడియో మెసెజ్ వచ్చింది. ఆ వీడియో మెస్సెజ్ లో తనను కిడ్నాప్ చేశారని మహిళ పేర్కొంది. మెసెజ్ వచ్చిన వెంటనే స్పందించిన దిశ సిబ్బంది ఆ నంబర్ కు కాల్ చేశారు. అయితే ఆ ఫోన్ అప్పటికే స్విఛ్చాఫ్ అయింది. దీంతో సిబ్బంది ఆ సమాచారాన్ని స్తానిక నల్లపాడు పోలీస్ స్టేషన్ కు అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నంబర్ ను ట్రేస్ చేశారు. ఆ ఫోన్ నంబర్ ఉన్న ఫోన్ ఆటోలో ఉన్నట్లు, అది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ను జిపిఎస్ ద్వారా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కానిస్టేబుల్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ ఆటోను గుర్తించి దాన్ని చేజ్ చేశారు. కొద్దీ దూరం పోయిన వెంటనే ఆటోను నిలిపి వేశారు.

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలను, ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో దిశ పోలీసులను టెస్ట్ చేసేందుకు వీడియో మెసెజ్ పెట్టినట్లు ఆ మహిళ ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక చేసేది లేక ఆ ముగ్గురు మహిళలను పోలీసులే ఇంటి వద్ద దించి వచ్చారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో కిడ్నాప్ మెసెజ్ రావటంతో పోలీసులు అలెర్ట్ కావటం వెంటనే ఆటోను ట్రేస్ చేయడంపై ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు. అయితే మహిళలు తప్పుడు మెసెజ్ లో చేయవద్దని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..