Vizag: కొత్త రాజధాని విశాఖలో ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ?

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్టింగ్‌కు సంబందించి ఇటీవలి కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చిన వెంటనే అలెర్ట్ అయిన అధికారులు వెంటనే ఏర్పాట్లపై దృష్టి సారించారు. వాస్తవానికి విశాఖలో ఏర్పాట్లకు సంబందించి ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తారని మొదట అనుకున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కమిటీ నియమించబడలేదు. అలా అని కమిటీ వేయకపోయినా, ఎక్కడ ఏ కార్యాలయం ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Vizag: కొత్త రాజధాని విశాఖలో ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ?
VMRDA Building
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 24, 2023 | 4:20 PM

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ నేపథ్యం లో విశాఖలో యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశాఖలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అవసరమైన దిశానిర్దేశాన్ని చేశారు. ఆ సమావేశంలో ఇప్పటివరకు అవసరమైన కార్యాలయాలు, నివాస గృహాల కోసం గుర్తించిన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల అంశాలను జిల్లా అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్టింగ్‌కు సంబందించి ఇటీవలి కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చిన వెంటనే అలెర్ట్ అయిన అధికారులు వెంటనే ఏర్పాట్లపై దృష్టి సారించారు. వాస్తవానికి విశాఖలో ఏర్పాట్లకు సంబందించి ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తారని మొదట అనుకున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కమిటీ నియమించబడలేదు. అలా అని కమిటీ వేయకపోయినా, ఎక్కడ ఏ కార్యాలయం ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు సంబంధించి విశాఖ అధికారులు ఒక లిస్ట్ తయారు చేయగా దానిపైనా సీఎస్ మీటింగ్‌లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు

అధికారికంగా దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ప్రస్తుతం విశాఖలోని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న జీవిఎంసీ ఆఫీస్‌ను అరిలోవ సమీపంలోని ముడసర్లోవకు తరలించాలని నిర్ణయించారు. అతి త్వరలో ఆ ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ముడసర్లోవలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఇటీవల కమిషనర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. అదే సమయంలో జీవీఎంసీ కార్యాలయాన్ని మునిసిపల్ అడ్మిన్‌కు కానీ లేదంటే ఏదైనా ఇతర ప్రభుత్వశాఖకు కేటాయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో సిరిపురం జంక్షన్‌లో ఉన్న వీఎంఆర్డీఏ భవనంలో ప్రస్తుతం 4 అంతస్తులు ఖాళీగా ఉన్నాయి, వాటిలో పలు ప్రభుత్వ శాఖలకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీచ్ రోడ్‌లో సబ్ మెరైన్ మ్యూజియం సమీపంలో 30వేల స్క్వేర్ యార్డ్స్‌లో స్మార్ట్ సిటీ భవనం, రుషికొండలో ఉన్న ఐటీహిల్‌లో ఏపీఐఐసీకి చెందిన మిలీనియం టవర్స్‌తో పాటు దాదాపు 2లక్షల చదరపు గజాల బిల్డింగ్ ఖాళీగా ఉంది. వీటిలో ఐటీ, ఇండస్ట్రీస్, ఇతర అనుబంధ శాఖలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కోసం కలెక్టరేట్ వెనుక కొత్తగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కేటాయించనున్నట్లు సమాచారం.

అధికారుల నివాస గృహాల కోసం

నివాగృహాల కోసం రుషికొండ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఆర్ కే బీచ్ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 150 ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి సిద్దం అయింది ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్స్ క్వార్టర్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 8 డూప్లెక్స్ ఇళ్లను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కొందరు విశాఖలో పలు ప్రాంతాల్లో స్థలాలను, విల్లాలను కొనుగోలు చేయగా, తాజాగా రోజా లాంటి మరికొందరు వెతుకులాటలో ఉన్నట్టు సమాచారం.

మినిస్టర్స్ క్వార్టర్స్ కోసం…

మినిస్టర్ క్వార్టర్స్ కోసం ఆయా శాఖల్లోని ఖాళీ భవనాలు, అతిథి గృహాలను ఎంపిక చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీ కాంప్లెక్సులో గతంలో ఖాళీగా ఉన్న ఫ్లోర్లను ఆధునీకరిస్తున్నారు. ఇందులో టూరిజం, ట్రాన్స్పోర్ట్ మంత్రుల కార్యాలయాలు, అదే సమయంలో రెన్నొవెట్ చేస్తున్న జెడ్పీ గెస్ట్ హౌజ్‌ను పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖకు, బీచ్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పట్టణాభివృద్ధి శాఖకు, ఈఎన్సీ కార్యాలయంలో ఇరిగేషన్ మంత్రికి, సింహాచలంలో ఎండోమెంట్స్ మంత్రికి కార్యాలయాలు కేటాయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు