Petrol Wasted: విశాఖలో పెట్రోల్ వర్షం..! 4వేల లీటర్లు నేలపాలు..! వీడియో..
అమ్మో..! ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు వేల లీటర్ల పెట్రోల్ వృధాగా నీటి పాలైంది. పెట్రోల్ తో తడిచి ముద్దైన ట్రక్ డ్రైవర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. విశాఖ ఐఓసీ టెర్మినల్లో పెట్రోల్ ఫిల్లింగ్ పైప్ పగిలిపోయిన ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖ సింధియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెర్మినల్ అనుహ్య ఘటన చోటు చేసుకుంది.
అమ్మో..! ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు వేల లీటర్ల పెట్రోల్ వృధాగా నీటి పాలైంది. పెట్రోల్ తో తడిచి ముద్దైన ట్రక్ డ్రైవర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. విశాఖ ఐఓసీ టెర్మినల్లో పెట్రోల్ ఫిల్లింగ్ పైప్ పగిలిపోయిన ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖ సింధియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెర్మినల్ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. లోడింగ్ కోసం ఆయిల్ ట్యాంకర్ టెర్మినల్ లోని ర్యాంపుపైకి వెళ్లింది. వెంటనే అన్లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా ఛాంబర్ నిండిన తర్వాత వాల్వు కట్టేయాలి. అలా చేసేలోపు అప్రమత్తంగా లేని ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడే ఉన్న కార్మికులు ఎంత గట్టిగా అరచినా డ్రైవర్ కు వినపడలేదు. ట్యాంకర్ ముందుకు పోనిచ్చాడు. హఠాత్ పరిణామంతో ట్యాంకర్‌లోకి మోటార్ స్పిరిట్ సరఫరా చేస్తున్న పైపు పగిలిపోయింది. పెట్రోల్ ఒక్కసారిగా ఎగజిమ్మింది. పక్కనే ఉన్న మరో ట్యాంకర్ డ్రైవర్‌పై వర్షంలా కురిసింది. తడిసి ముద్దైన డ్రైవర్ రెప్పపాటు కాలంలో అక్కడి నుంచి సురక్షితంగా తప్పించారు. లక్షల లీటర్ల పెట్రో నిల్వలు ఉన్న ప్రాంతం కావడంతో వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది.. మెయిన్ వాల్వు బ్లాక్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ పైపు పగిలిన ఘటనలో ట్యాంకర్‌లోని 4 వేల లీటర్ల పెట్రోల్ వృథాగా పోయిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం అంతా పెట్రోల్ తో నిండిపోయింది. ఫ్లాంట్ పరిసర ప్రాంతాల్లో కదలికలపై ఆంక్షలు విధించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..