Students Shot: అర్ధరాత్రి పార్టీలో చిందులేసిన యువతి.. అంతలోనే కాల్పులు.. వీడియో వైరల్.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 23 ఏళ్ల నిష్ఠా త్రిపాఠి లక్నోలోని బీబీడీ యూనివర్సిటీలో బీకామ్ చదువుతుంది. బుధవారం కాలేజీలో గణేష్ వేడుక తర్వాత దయాళ్ రెసిడెన్సీ ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితుడు ఆదిత్య పాఠక్ సలహా మేరకు అక్కడకు వెళ్లగా అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పార్టీ జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 23 ఏళ్ల నిష్ఠా త్రిపాఠి లక్నోలోని బీబీడీ యూనివర్సిటీలో బీకామ్ చదువుతుంది. బుధవారం కాలేజీలో గణేష్ వేడుక తర్వాత దయాళ్ రెసిడెన్సీ ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితుడు ఆదిత్య పాఠక్ సలహా మేరకు అక్కడకు వెళ్లగా అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పార్టీ జరిగింది. మద్యం తాగిన యువతీయువకులు చిందులు వేశారు. అంతలోనే పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో నిష్ఠా త్రిపాఠి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. రూమ్‌లో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన యువతి స్నేహితుడు ఆదిత్య పాఠక్‌తో సహా ఆ పార్టీలో పాల్గొన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిష్ఠా త్రిపాఠిపై ఎవరు కాల్పులు జరిపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..