Viral: గిరిజనులకు తప్పని వాగు కష్టాలు.! వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా, కొంగొత్త పథకాలు అమలులోకి వచ్చినా గిరిజనుల కష్టాలు మాత్రం తీరడంలేదు. రహదారి సదుపాయాలు లేక, వాగులు వంకలూ దాటుతూ గడి గడిగండంలా జీవనం సాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. మరి గర్భిణుల సంగతి చెప్పనక్కర్లేదు. గర్బినిలను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి.
ఎన్ని ప్రభుత్వాలు మారినా, కొంగొత్త పథకాలు అమలులోకి వచ్చినా గిరిజనుల కష్టాలు మాత్రం తీరడంలేదు. రహదారి సదుపాయాలు లేక, వాగులు వంకలూ దాటుతూ గడి గడిగండంలా జీవనం సాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. మరి గర్భిణుల సంగతి చెప్పనక్కర్లేదు. గర్బినిలను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. డెలివరీ డేట్ కంటే పది రోజుల ముందుగానే ఆస్పత్రికి తరలించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నా.. కిందిస్థాయి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో గిరిజన తల్లులు వాగు ఒడ్డునో, రోడ్డుపక్కను ప్రసవిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజేన్సీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం దొంగచింత పంచాయతీ పరిధిలో వాగు ఒడ్డునే ప్రసవించింది ఓ గిరిజన మహిళ. చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది దొంగచింత గ్రామానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 2 కిమీ దూరంలోనే అంబులెన్స్ సిబ్బంది ఆగిపోయారు. అక్కడినుంచి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి గర్బిని తీసుకొచ్చారు. వాగు వద్దకు తీసుకు రాగానే గర్భిణికి నొప్పులు ఎక్కువ అయ్యాయి. మరో వైపు వర్షం కూడా కురుస్తోంది. తప్పనిసరి పరిస్థితిలో తోటి మహిళల సాయంతో వాగు ఒడ్డునే గొడుగు పట్టి ప్రసవం చేశారు. అనంతరం వారిని జాగ్రత్తగా వాగు దాటించి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 108 సిబ్బంది శంకర్, పైలట్ సచిన్ లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..