Hyderabad: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్ మండపంలో లడ్డును ఎత్తుకెళ్లిన విద్యార్థులు. వైరల్ వీడియో..
తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన స్కూల్ విద్యార్థుల అల్లరి పనికి పరాకాష్టగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధి వీధిన వినాయక మండపాలు వెలిశాయి. భక్తులు వినాయకుడిని నవరాత్రులు పూజిస్తున్నారు. ఓవైపు వినాయక వేడుకలు జరుగుతుంటే మరికొందరు మాత్రం...
చిన్నప్పుడు చేసే పనులు చిలిపిగా ఉంటాయి. కానీ ఆ పనులు శృతిమించితే మాత్రం బాగోదు. స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు సరదాగా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేయాలి కానీ కొందరు మాత్రం హద్దు మీరుతున్నారు. తెలిసీ తెలియక తప్పులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన స్కూల్ విద్యార్థుల అల్లరి పనికి పరాకాష్టగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధి వీధిన వినాయక మండపాలు వెలిశాయి. భక్తులు వినాయకుడిని నవరాత్రులు పూజిస్తున్నారు. ఓవైపు వినాయక వేడుకలు జరుగుతుంటే మరికొందరు మాత్రం తమ చేతి వాటం చూపిస్తున్నారు. వినాయక మండపాల్లో ఉండే వస్తువులను దొంగలిస్తున్నారు. అయితే సీసీటీవీల్లో ఇవి రికార్డు కావడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ఇలాంటి ఓ సంఘటనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చోటు చేసుకుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాన్సీ బజార్‌లో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండపంలో 21 కిలోల లడ్డును కూడా ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ స్కూల్ నుంచి కొంత మంది విద్యార్థులు మండపం ముందు నుంచి అటుగా వెళ్లారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడ్డారు. అందులో ఉన్న 21 కిలోల లడ్డును ఎత్తుకెళ్లారు. మండపానికి దగ్గరల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.