Chandrababu Interrogation: రెండోరోజు విచారణ ప్రారంభం.. ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..

Shaik Madar Saheb

|

Updated on: Sep 25, 2023 | 11:48 AM

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రెండో రోజు విచారణ ప్రారంభమైంది. 40 నిమిషాలు ముందుగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణను ప్రారంభించారు. విచారణకు ముందు చంద్రబాబుకు యథావిధిగా మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు విచారణను ఉదయం 9.30కి సీఐడీ అధికారులు ప్రారంభించారు.

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రెండో రోజు విచారణ ప్రారంభమైంది. 40 నిమిషాలు ముందుగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణను ప్రారంభించారు. విచారణకు ముందు చంద్రబాబుకు యథావిధిగా మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు విచారణను ఉదయం 9.30కి సీఐడీ అధికారులు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. నిన్నటిలానే.. గంటగంటకు ఐదు నిమిషాలు బ్రేక్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండో రోజు విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఆక్టోపస్, సివిల్ పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. నేటితో చంద్రబాబు రెండు రోజుల విచారణ ముగియనుంది. అంతనరం సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు సీల్డు కవర్‌లో నివేదికను అందించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును, చంద్రబాబు నుంచి సేకరించిన సమాచారాన్ని కోర్టుకు అందించనుంది.

కాగా.. చంద్రబాబు రిమాండ్ 14వరకు రోజుకు చేరింది. ఉదయాన్నే చంద్రబాబుకు లోకేష్‌ క్యాంప్‌ నుంచి అల్పాహారం తీసుకువచ్చారు. చంద్రబాబుకు అల్పాహారం, బ్లాక్‌కాఫీ ఇచ్చారు. ఇవాళ్టితో చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌ ముగియనున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా..? లేక ఏసీబీ కోర్టు మళ్లీ రిమాండ్ పొడగిస్తుందా..? అనేది ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 24, 2023 09:42 AM