పోలీస్ స్టేషన్‌లో దొంగతనం.. స్టేషన్ గోడకి కన్నం వేసి సీజ్ చేసిన మద్యం సీసాలు చోరీ
దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్‌నే లూటీ చేశారు. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహిస్తోన్న ముఠాల నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. అయితే దొంగలు పోలీస్ స్టేషన్‌ను కూడా వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్టేషన్‌లోకి ప్రవేశించి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 22) చోటు..
పట్నా, సెప్టెంబర్ 25: దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్‌నే లూటీ చేశారు. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహిస్తోన్న ముఠాల నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. అయితే దొంగలు పోలీస్ స్టేషన్‌ను కూడా వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్టేషన్‌లోకి ప్రవేశించి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 22) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమ రవాణా జరుగుతున్న క్రమంలో పోలీసులు భారీ మొత్తంలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొని బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 22) భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసులందరూ ఒకే చోటకు చేరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దొంగలు పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న స్టోర్ రూం గోడ పగులగొట్టి ఐదు బాక్సులు, బ్యాగ్ నిండా మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో చోరీ జరుగుతోందని అక్కడ ఉన్న పోలీసులకు తెలియక పోవడం విశేషం. ఆ మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతైంది. శనివారం ఉదయం స్టోర్ రూంలో భద్రపరచిన మద్యం సీసాలు కనిపించకపోవడాన్ని గమనించిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో నిన్న రాత్రి నుంచి భోలా కుమార్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని గుర్తించిన పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలో ఆ వ్యక్తి అఖారాఘాట్ వంతెన కింద పట్టుబడ్డాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన మద్యం బాటిళ్లు పోలీస్ అవుట్‌పోస్టు సమీపంలోని జంక్‌యార్డ్‌లో పాత ఫ్రిజ్‌లో కొన్ని బాటిళ్లను ఉంచినట్లు తెలిపాడు
శుక్రవారం రాత్రి తన సహచరుడితో కలిసి చాకచక్యంగా పోలీస్ స్టేషన్ గోడ దూకి లోనికి ప్రవేశించామని, ఉలి, రాడ్‌తో వెంటిలేటర్‌ను పగలగొట్టి గోడకు రంధ్రం చేసి స్టోర్ రూంలోకి ప్రవేశించినట్లు భోలా కుమార్ తెలిపాడు. చోరీ చేసిన మద్యం బాటిళ్లు మరుసటి రోజు మద్యం మార్కెట్‌లో విక్రయించాలని ప్లాన్ చేశారు. కానీ దానిని విక్రయించడానికి ముందే పోలీసులు జంక్‌యార్డ్ సమీపంలోని పాత ఫ్రిజ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. భోలా కుమార్‌కు సహకరించిన మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఓపీ ఇన్‌చార్జి దేవబ్రత కుమార్ తెలిపారు. ఫ్రిజ్‌లో దొరికిన మద్యం పోలీస్ స్టేషన్ నుంచి చోరీకి గురైన మద్యమేనని నిర్ధారించారు. మొత్తం 56 లీటర్ల మద్యం చోరీ అవ్వగా.. 32 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సామాజిక మాద్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.