Krishna Mukunda Murari Episode September 26th, 2023: ముకుందకి సాయం చేసి దెబ్బలు తిన్న అలేఖ్య.. భవానికి ఆదర్శ్ అంటే ఇష్టంలేదని చెప్పే పనిలో ముకుంద..

అలేఖ్య ఆరేసిన బట్టలు తీసుకుని రావడానికి కృష్ణ పైకి వెళ్ళింది అని మురారీకి చెబుతుంది. దీంతో మురారీ కృష్ణ కృష్ణ అంటూ డాబామీదకు వెళ్తాడు. దేవుడా ఇప్పుడు ఏమి జరుగుతుందో ఏమిటో అని అలేఖ్య అనుకుంటుంది. డాబామీదకు వచ్చిన మురారీని వెనుక నుంచి కళ్ళు మూసి హత్తుకుంటుంది. నేను పిలిస్తే నువ్వు రావని తెలిసి.. అలేఖ్యని ఇలా చెప్పమని చెప్పా.. తన తప్పేమి లేదు అంటుంది. వదులు ముకుంద అని అంటే.. ఇక నావల్ల కాదు మురారీ చెంపేసినా చస్తాకానీ ఇక నేను నిన్ను వదలను అని అంటుంది

Krishna Mukunda Murari Episode September 26th, 2023: ముకుందకి సాయం చేసి దెబ్బలు తిన్న అలేఖ్య.. భవానికి ఆదర్శ్ అంటే ఇష్టంలేదని చెప్పే పనిలో ముకుంద..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us

|

Updated on: Sep 26, 2023 | 6:59 AM

జల్లెడలో నిండు చంద్రుడిని చూసి కట్టుకున్న భర్తను చూస్తే ఏడేడు జన్మలకు తనే భర్తగా వస్తాడని నమ్మకం అని అంటే.. ఈ రోజు జల్లెడలో నేను ఆదర్శ్ ని కాదు మురారీని చూస్తాను అని ముకుంద అనుకుంటుంది. కృష్ణ మురారీని .. సుమ ప్రసాద్ ను .. అలేఖ్య మధుని చూస్తుంది. చివరికి మధు ఆదర్శ్ ఫోటో పట్టుకుంటే.. అలేఖ్య అడ్డుపడి.. ఆదర్శ్ ఫోటోని పట్టుకున్న మురారీని చూసిన ముకుంద..  అలేఖ్య.. సాయం చేసింది. ముకుంద అసలు ఆదర్శ్ ఫోటోని చూస్తుందా మురారీని చూస్తుందా అని కృష్ణకు డౌట్ వచ్చి చేస్తుంది. అప్పుడు మురారీని చూసినట్లు కన్ఫమ్ చేసుకుంటుంది కృష్ణ.

బరితెగించిన ముకుంద..

అలేఖ్య ఆరేసిన బట్టలు తీసుకుని రావడానికి కృష్ణ పైకి వెళ్ళింది అని మురారీకి చెబుతుంది. దీంతో మురారీ కృష్ణ కృష్ణ అంటూ డాబామీదకు వెళ్తాడు. దేవుడా ఇప్పుడు ఏమి జరుగుతుందో ఏమిటో అని అలేఖ్య అనుకుంటుంది. డాబామీదకు వచ్చిన మురారీని వెనుక నుంచి కళ్ళు మూసి హత్తుకుంటుంది. నేను పిలిస్తే నువ్వు రావని తెలిసి.. అలేఖ్యని ఇలా చెప్పమని చెప్పా.. తన తప్పేమి లేదు అంటుంది. వదులు ముకుంద అని అంటే.. ఇక నావల్ల కాదు మురారీ చెంపేసినా చస్తాకానీ ఇక నేను నిన్ను వదలను అని అంటుంది ముకుంద. ప్లీజ్ ముకుంద వదులు ఎందుకు నువ్వు నన్ను పదే పదే వేధిస్తున్నావు.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఆలోచించావా అని అంటే.. నాకు అవన్నీ అవసరం లేదు మురారీ నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని అంటుంది ముకుంద.. నాకు నువ్వే కావాలి.. నాకు నీ ప్రేమ మాత్రమే ముఖ్యం అని అంటుంటే.. వదులు వదులు అని మురారీ బతిమాలాడతాడు.

మురారికి ముకుందకు కాపలాగా అలేఖ్య

అలేఖ్య టెన్షన్ పడుతుంటే రేవతి వస్తుంది.. తనకి నామీద ఏమి డౌట్ రాకూడదు. నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోవాలి అని అనుకునుంటే.. రేవతి వచ్చి నీ వాలకం చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది అని అంటుంది రేవతి. మంచిగా అడిగినప్పుడు నిజం చెప్పు.. అని అంటే.. ఎందుకు నేను అంటే మీకు అపనమ్మకం.. అందరిని ఒకలా చూస్తారు నన్ను ఒకలా చూస్తారు అని అన్న అలేఖ్యని రేవతి లాగి చెంప మీద ఒకటి కొట్టింది. నిజం చెబుతావా ఇంకో చెంప దెబ్బ రుచి చూస్తావా..అని అంటే.. ముకుంద వేసిన ప్లాన్.. ఎవరూ రాకుండా తనని కాపలా పెట్టిన విషయం మొత్తం చెప్పేస్తుంది.

ఇవి కూడా చదవండి

మన పెళ్లి గురించి మాట్లాడదామన్న ముకుంద

ఇప్పుడే మనం వెళ్లి భవానీ అత్తయ్యకు మనం నిజం చెప్పేసి మన పెళ్లి గురించి మాట్లాడదాం.. ఆదర్శ్ ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆదర్శ్ కు నీ సంతోషం కంటే ఇంకేమీ అక్కర్లేదు నన్ను నమ్ము మురారీ అని అంటుంది. పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. మన పెళ్లి గురించి మాట్లాడేద్దాం అని అంటుంది.

సహనం కోల్పోయిన రేవతి..

పైకి వచ్చిన రేవతి ముకుంద మురారీని కౌగిలించుకుని ఉండడం చూసి షాక్ అవుతుంది. చెప్పేది నీకే అంటూ ముకుంద నుంచి మురారీ విడిపించుకుంటాడు. ఇద్దరూ అక్కడ ఉన్న రేవతి చూస్తారు. ఏమి జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తుంది రేవతి.. అతయ్య మురారీ తప్పేమి లేదు అని చెప్పబోతుంటే..నువ్వు మాట్లాడకు అన్ని ముకుంద ఆపి వెళ్ళారా అని మురారీని అక్కడ నుంచి పంపించేస్తుదని.

నా జీవితాన్ని అన్యాయం చేయకండి

అత్తయ్య మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా.. మురారీ లేకుండా నేను బతకలేను.. నా జీవితాన్ని అన్యాయం చేయకండి ప్లీజ్ అత్తయ్య అంటూ రేవతి ని వేడుకుంటుంది. అసలు తనని పట్టించుకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నా ప్రేమ కోసం ఎన్ని అవమానాలనైనా బరిస్తా ఎవరు కాదన్నా నేను మురారీని వదులు కొను అనుకుంటుంది ముకుంద.

ముకుంద తండ్రి దగ్గరకు వెళ్లిన కృష్ణ

ముకుంద తండ్రి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లిన కృష్ణ ..భయపడకండి నేను మంచి విషయం చెప్పడానికే వచ్చాను అని అంటుంది. బాబాయ్ ఆదర్శ్ తప్పకుండా తిరిగి వస్తాడు ముకుంద జీవితం బాగుటుంది అని అంటే.. నవ్వు తుంటే.. ఎందుకు బాబాయ్ నవ్వుతున్నావు అని అంటే..  ఇదే మాట భవానీ, రేవతి చెప్పారు.. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు.. తెలియకుండా చేసిన తప్పుల్ని తెలిసి కూడా సరిదిద్దుకోలేము అని అంటాడు శ్రీనివాస్. నా కూతురు జీవితం కూడా అంతే అంటే.. బాబాయ్… నేను అంత తేలికగా ఎవరికీ మాట ఇవ్వను ఇస్తే మట్టుకు ప్రాణం మీదకు వచ్చినా నిలబెట్టుకుంటానని చెబుతుంది కృష్ణ.  మీరు నా తండ్రి లాంటివారు..  నేను మీ చిన్న కూతురుని అనుకోండి..  ఆదర్శ్ ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను నిలబెట్టుకుంటాను.. ముకుంద జీవితం బాగుటుంది మీరు దిగులు పడకండి.. అని కృష్ణ శ్రీనివాస్ కు మాట ఇస్తుంది.

మురారీని గుర్తు చేసుకుని ఆనందంలో ముకుంద..

నా ప్రేమ ఫలించడానికి ఇంకెంత దూరంలో లేదు.. కృష్ణ కాపురం కాలి బూడిద అవుతుంది. అని అనుకుంటుంటే.. కృష్ణ ఏసీపీ సార్ అంటూ వస్తుంది. కుక్కపిల్లలా ఎంత సేపూ ఏసీపీ సార్ అని అంటుంది.. అనుకుంటూ కృష్ణ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు.. గుడికి వెళ్లి వస్తున్నావా.. నీ కాపురం బాగుండాలని మొక్కుకున్నావా అని కృష్ణను అడుగుతుంది ముకుంద. గుడికి వెళ్ళలేదు.. దేవుడు కూడా వరం ఇవ్వలేదు.. కానీ నేను మాత్రం మీ ఇంటికి వెళ్లి మీ నాన్నకు వరం ఇచ్చి వస్తున్నా.. అర్ధం కాలేదా బాబాయ్ తో మాట్లాడి వస్తున్నా అని కృష్ణ చెబుతుంది. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి ఎవరు వెళ్లామన్నారు అని ముకుంద అడిగితే వెళ్తే ఏమైంది.. ఒకవేళ నీ గురించి ఏమైనా తెలుస్తుందని టెన్షనా అని అడుగుతుంది కృష్ణ. ఎవరెటు పొతే నాకెందుకు అనే స్వార్ధంతో ఆలోచించడం మానేసేయ్యి ముకుంద అని సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది కృష్ణ.

దోమలతో మాట్లాడుతున్న కృష్ణ

తనను కొడుతున్న దోమలతో మాట్లాడుతూ వాటిని బ్యాట్ తో వేటాడుతుంది. బయట ముకుంద ఎంత టార్చర్ చేస్తున్నా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాను అంటే నీ అమాయకత్వం, నీ తింగరి తనమే కృష్ణ అని అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో

భవానీ దగ్గరకు పాలు తీసుకుని వెళ్లి.. తన ప్రేమ విషయం చెప్పాలని ప్లాన్ వేసిన ముకుంద…

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..