Bigg Boss 7 Telugu: నామినేషన్స్ రచ్చ.. సుబ్బును ఏడిపించిన అమర్.. రతిక దెబ్బకు రైతు బిడ్డ షాక్..
మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లో చేరారు. అయితే నామినేషన్స్ రచ్చ మాత్రం మాములుగా జరగడం లేదు. ముఖ్యంగా రతిక.. స్నేహం చేస్తూనే సమయం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నే టార్గెట్ చేస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య మరోసారి హీట్ డిస్కషన్ నడించింది. మరోసారి ప్రశాంత్ విషయంలో ప్లేట్ తిప్పేసింది రతిక.. దెబ్బకు రైతు బిడ్డ నోరెళ్లబెట్టాడు.
బిగ్బాస్ హౌస్లో నామినేషన్స్ ఫుల్ హీటెక్కాయి. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేస్తూ గొడవలకు దిగుతున్నారు. ఇక ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణకు కొట్టుకోవడానికి రెడీ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నామినేట్ చేసే కంటెస్టెంట్లను జ్యూరీ సెలక్ట్ చేస్తుంది. ఇప్పటికే హౌస్మేట్స్ అయిన సందీప్, శివాజీ, శోభా శెట్టిలను జ్యూరీగా సెలక్ట్ చేశాడు బిగ్బాస్. మొత్తం 5 రౌండ్లలో ఐదుగురు కంటెస్టెంట్లను నామినేషన్ లిస్ట్ లో చేశారు. యావర్ .. ప్రియాంకను, శుభ శ్రీ.. రతికను, ప్రశాంత్.. గౌతమ్ ను, అమర్.. శుభ శ్రీని, గౌతమ్ యావర్ ను నామినేట్ చేశారు. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లో చేరారు. అయితే నామినేషన్స్ రచ్చ మాత్రం మాములుగా జరగడం లేదు. ముఖ్యంగా రతిక.. స్నేహం చేస్తూనే సమయం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ నే టార్గెట్ చేస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య మరోసారి హీట్ డిస్కషన్ నడించింది. మరోసారి ప్రశాంత్ విషయంలో ప్లేట్ తిప్పేసింది రతిక.. దెబ్బకు రైతు బిడ్డ నోరెళ్లబెట్టాడు.
ప్రశాంత్ .. గౌతమ్ ను నామినేట్ చేశాడు. శోభా శెట్టితో గొడవ జరిగిన తర్వాత నువ్వు షర్ట్ తీసేయడం నచ్చలేదంటూ రీజన్ చెప్పగా.. గౌతమ్ అరుస్తూ గట్టిగా వాదించాడు. రతికను పొట్టి డ్రెస్ వేసుకున్నప్పుడు ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ గౌతమ్ క్వశ్చన్ చేయేగా.. నేను ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకురా బై.. అంటూ గొడవ పెట్టుకుంది రతిక. దీంతో నా ముందుకు వచ్చి ఇట్ల ఇట్ల ఎందుకన్నావ్ అని ప్రశాంత్ అడగ్గా.. నన్ను నీ ప్రాపర్టీ అని ఎట్లంటావ్ రా బై .. నా మీద నీకు ఏం రైట్ ఉందంటూ ప్రశ్నించింది. దీంతో దోస్త్ కాబట్టి మజాక్ చేసిన అంటూ ప్రశాంత్ అనగా.. మజాక్ చేయనికీ నువ్వు ఎవర్రా బై నాకు అంటూ మరింత రెచ్చిపోయింది రతిక. చివరకు నీకో దండం తల్లి.. ఇక నీ జోలికి రానంటూ ప్రశాంత్ దండం పెట్టేశాడు.
View this post on Instagram
ఇక ఆ తర్వాత శుభా శ్రీ, అమర్ దీప్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. సుబ్బు వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటూ రీజన్ చెప్పాడు. దీంతో దమ్ముంటే రీజన్ చెప్పి నామినేట్ చేయ్..కానీ ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటూ చేయడమేంటీ అంటూ సుబ్బు అనగా.. నేను ఇలాగే చేస్తానంటూ వాధించాడు అమర్. అవకాశం వస్తే వదిలేసి గుండు కొట్టించుకోలేంటూ సుబ్బు అనగా.. నేను ఓడిపోయాను, ఆడలేదంటూ అనొద్దు అంటూ రెచ్చిపోయాడు అమర్ దీప్. దీంతో ఛీ అని సుబ్బు అనడంతో మరోసారి నోటికి పని చెప్పాడు అమర్. చివరకు సుబ్బు ఏడ్చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.