Bigg Boss 7 Telugu: బూతులతో రెచ్చిపోయిన హీరోస్.. బాబోయ్ రతిక అక్కా.. దండం పెట్టేసిన ప్రశాంత్..

ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని.. ఇంటి సభ్యులతో సరిగ్గా మాట్లాడట్లేదంటూ నామినేట్ చేశాడు గౌతమ్. తూ క్యారే అంటూ యావర్.. మరొకరి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిస్తున్నాడు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని చెప్పాను.. నాగ్ సర్ కూడా చెప్పారు..

Bigg Boss 7 Telugu: బూతులతో రెచ్చిపోయిన హీరోస్.. బాబోయ్ రతిక అక్కా.. దండం పెట్టేసిన ప్రశాంత్..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 27, 2023 | 6:36 AM

బిగ్‏బాస్ ఇంట్లో రెండో రోజు నామినేషన్స్ మరింత హీటెక్కాయి. మరోసారి గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యానర్ బిహేవియర్ నచ్చట్లేదని.. ఇంటి సభ్యులతో సరిగ్గా మాట్లాడట్లేదంటూ నామినేట్ చేశాడు గౌతమ్. తూ క్యారే అంటూ యావర్.. మరొకరి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిస్తున్నాడు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని చెప్పాను.. నాగ్ సర్ కూడా చెప్పారు.. నాకు ఇప్పుడు గుండె ఆగిపోతే… ఇబ్బంది పడితే నేను డాక్టర్ దగ్గరకు వెళ్తానా లేదా తర్వాత వెళ్తాను కదా.. నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు పోయిన వారం నామినేట్ చేయాల్సింది అంటూ యావర్ తన సైడ్ వాదన వినిపించాడు. మధ్యలో గౌతమ్ కల్పించుకోగా.. ఇది నా పాయింట్ నేను మాట్లాడుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు యావర్. నీకు డాక్టరేట్ ఎవరైతే ఇచ్చారో వారు చదువుకున్నవారు కాదు.. ఎందుకంటే మీరు డాక్టర్ అయ్యుంటే అది చెప్పి ఉండేవారు కాదు.. నిజమే కదా.. మీరు డాక్టర్ అయ్యుంటే.. మీరు ఆ మాట అనేవారు కాదు అంటూ యావర్ వాదించాడు. నీకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు టాబ్లెట్స్ గురించి అడుగుతావు అంటూ గౌతమ్ అరిచాడు.

గౌతమ్, యావర్ వాదన జరుగుతుండగా.. శోభా ముందు నువ్వు చేసిందేంటీ గౌతమ్ అంటూ ప్రశ్నించాడు శివాజీ. ఒక ఆడపిల్ల ముందు షర్ట్ తీసేసావ్ కదా.. అదేంటని అడగ్గా.. మీరు లాయర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక సైడే మాట్లాడుతున్నారు అంటూ వాదించారు. ఇది జ్యూరీ రా బాబు.. ఒక సైడ్ కాదంటూ శివాజీ చెప్పగా.. మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగిందని ప్రశ్నించాడు శివాజీ. యావర్ ను నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని అడగ్గా.. నేను ఒకరోజు యావర్ లాగే బిహేవ్ చేస్తూ మీ మీదకు వస్తాను అప్పుడు మీకు అర్థమవుతుందని.. మొదటి నుంచి ఒకసైడే ఫేవర్ చేస్తున్నారన్నాడు గౌతమ్.

ఇంట్లో వాళ్లు నాకు ఫ్రెండ్స్ అంటే.. ప్రతి ఒక్కరు ఏదోఒకరోజు వెళ్లిపోతారు.. మనం గేమ్ ఆడుతున్నాము.. కానీ ఫ్యామిలీ కాదు అంటూ శివాజీ అన్నాడు. నాగార్జున సిల్లి సిల్లి రీజన్స్ చెప్పిన నామినేట్ చేసి.. ప్రేక్షకులకు అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.. నీ పాయింట్ సరైనది అయితే తీసుకుంటామని శివాజీ అన్నాడు. ఇక చిర్రెత్తుకొచ్చిన గౌతమ్ చేతిలోని గొడుగు నెలకొసి కొట్టి.. యావర్ అన్న మాటలకు చచ్చిపోవాలనిపిస్తోందంటూ మైక్ తీసి పడేశాడు. మీకు అర్థం చేసుకునే కేపబులిటి లేదని నాకు అర్థమయ్యింది.

“నువ్వేంత.. నువ్వెంత.. అన్నప్పుడు ఒక మనిషికి చాలా హర్ట్ అవుతుంది. నేనేంత అని మీరు ఫీలైనప్పుడు దెబ్బతగిలినప్పుడు నన్నెందుకు అడగాలి. అవసరం వచ్చినప్పుడు నన్ను వాడుకున్నారు “అంటూ రెచ్చిపోయాడు గౌతమ్. బిగ్‏బాస్ ఉన్నాడు.. నువ్వు చేయ్యక్కర్లేదు.. హ్యూమానిటీతో వస్తే ఒకే.. అంటూ శివాజీ అనగా.. దీంతో నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని శోభా శెట్టి కౌంటరిచ్చింది. కంటిన్యూగా వాదనలు కొనసాగుతుండగా.. బిగ్‏బాస్ కల్పించుకుని వాదన సమయం ముగిసింది అన్నాడు. దీంతో యావర్‏ను నామినేట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

ఇక అమర్ దీప్ మాట్లాడుతూ.. ట్రాక్ మారిపోతున్నావు..ట్రిగ్గర్ అవుతున్నావ్.. నీకు నువ్వుగా బాంబ్ పెట్టుకుంటున్నావ్..నోరు జారుతున్నావ్ అంటూ గౌతమ్ కు సలహా ఇచ్చాడు. నాకు ఉండాలని లేదు. వెళ్లిపోవాలని ఉంది నామినేట్ చేయండి వెళ్లిపోతాను అన్నాడు గౌతమ్. తర్వాత అమర్ దీప్ వచ్చి పల్లవి ప్రశాంత్, శుభ శ్రీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు.

సుబ్బు నువ్వు అన్న మాటలు నచ్చట్లేదు. జుట్టు తీసేస్తే నేను ఆడలేను.. నాపై నాకు డౌట్ వస్తుంది. నీ మాటలు నాకు హార్ట్ అనిపించింది. నేను ప్రియాంక కలిసి ఆడుతున్నామా అనేది మా స్ట్రాటజీ. శుభా శ్రీ మాటలకు నేను హర్ట్ అయ్యాను అందుకే నామినేట్ అని అమర్ దీప్ చెప్పగా.. అస్సలు ఒప్పుకోను అని చెప్పేసింది సుబ్బు.

పల్లవి ప్రశాంత్ బయటకు వస్తే మీరెవరు తట్టుకోలేరు అని అన్నావ్.. నువ్వు బాగా నటిస్తున్నావ్.. సెలక్ట్ చేయలేదని ఏడ్చవ్.. లోపలికి వెళ్లి ఏడుస్తూ ఆలోచించకుండా పేరు చెప్పేశాను అన్నావ్. నువ్వు రెండు ముఖాలతో ఆడుతున్నాయి. మాస్క్ తీసి ఆడు.. దాగుడు మూతల దండకోర్ ఆట ఆడుతున్నావ్.. నువ్వు ఎలా ఉంటావో అలా ఆడు.. రెండు ముఖాలు వద్దు.. రెండు నాలుకలు వద్దు అంటూ అరమ్ దీప్ చెప్పాడు. రెండు ముఖాలు ఎట్లా ఉంటాయంటూ కౌంటరిచ్చాడు ప్రశాంత్. ఇంట్లో ప్రశాంత్ లేడు అని మరో రీజన్ చెప్పాడు అమర్ దీప్. దీంతో అమర్ చెప్పిన రీజన్స్ సిల్లిగా ఉన్నాయని జ్యూరీ సభ్యులు చెప్పగా.. పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్.. బిహేవియర్ నచ్చలేదని అమర్ చెప్పగా.. నీకు రెండు ముఖాలు ఉంటాయని అన్నాడు ప్రశాంత్.

మధ్యలో వచ్చిన రతిక.. కన్సెక్షన్  రూంకు వెళ్లకముందే ఏడుపు ఆగిపోయింది..సెమియా తిందామని అన్నాడు. మళ్లీ వెళ్లి ఏడ్చాడు.. ఇదే యాక్టింగ్ అంటూ ప్రశాంత్ కు షాకిచ్చింది రతిక. పల్లవి ప్రశాంత్ అంటే ఒక్కడే ఉంటాడు.. నేను ఇట్టాగే ఉంటా అని ప్రశాంత్.. అమర్ దీప్ అంటే ఒక్కడే ఉంటాడు అంటూ మళ్లీ రెచ్చిపోయాడు అమర్ దీప్. పల్లవి ప్రశాంత్ అంటే నీ ఛానల్ చాలు నీ గురించి చెప్పడానికి అమర్ దీప్ అన్నాడు. చివరకు సుబ్బును నామినేట్ చేశారు జ్యూరీ సభ్యులు. దీంతో మీ డెసిషన్ కరెక్ట్ కాదంటూ జ్యూరీ సభ్యుల నిర్ణయం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుబ్బు. ఛీ.. చెత్త రీజన్ అని సుబ్బు అంటే.. నోరు జారకు అంటూ సీరియస్ అయ్యాడు అమర్ దీప్. దమ్ముంటే రీజన్ చెప్పు .. హర్ట్ అవుతున్నానంటూ చెప్పు అంటూ ఏడ్చేసింది.

ఇక ప్రశాంత్ .. అమర్, గౌతమ్ ఇద్దరిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇచ్చినా నువ్వు ఉపయోగించుకోలేదు. జుట్టు గురించి ఒక్క నిమిషం ఆలోచించకుండా చేయ్యను అని చెప్పేశావు. అమ్మాయి ధైర్యం చేసింది.. నువ్వు చేయలేదు అని చెప్పడం నాకు నచ్చలేదు అని ప్రశాంత్ చెప్పగా.. నాకు ఎంతో పెయిన్ ఉంటే ఒప్పుకోలేదంటూ అమర్ చెప్పుకొచ్చాడు. ఇక శోభా ముందు నువ్వు షర్ట్ తీసేయడం నచ్చలేదు అని ప్రశాంత్ చెప్పాడు. గొడవ పెట్టుకున్నప్పుడ వేరు.. జిమ్ చేస్తున్నప్పుడు షర్ట్ తీయడం వేరు అని ప్రశాంత్ చెప్పగా.. మధ్యలోకి రతిక డ్రెస్సింగ్ గురించి గౌతమ్ తీశాడు.

రతిక పొట్టి డ్రెస్ వేసుకుంటే ప్యాంట్ వేసుకో అన్నాడు అది కరెక్టా అని రివర్స్ అడగ్గా.. అందరిని అన్నాను అలాగే అని ఆన్సర్ ఇచ్చాడు అన్నాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నేను షర్ట్ తీసి ఉండడం నీకు రాంగ్ అనిపిస్తుందా అంటూ ఇంటి సభ్యులందరిని అడిగాడు గౌతమ్. రతిక పొట్టి బట్టలు వేసుకుంటే నాకు నచ్చలేదు చెప్పినా అని ప్రశాంత్ చెప్పగా.. నేను ఎట్లా వేసుకుంటే నీకెందుకు అంటూ గొడవకు దిగింది రతిక. సారీ చెప్పితే నేను మాట్లాడినా.. మళ్లీ ఏయ్ అంటూ మాట్లాడతాడు అంటూ నేనెంటీ అని రతిక సందీప్ తో అనగా.. ఇక రతిక అనను.. అక్కా అంటా అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య మరోసారి గొడవ జరిగింది. నా ప్రాపర్టీ అంటూ రాస్తావ్ అని రతిక అడగ్గా.. నీ గురించి రాయలేదు అని ప్రశాంత్ చెప్పగా.. నువ్వు ఎవడ్రా అంటూ ఫైర్ అయ్యింది రతిక. నీతో నాకు లొల్లి వద్దు.. నీ పేరు తీస్తే చెప్పుతో కొట్టు అంటూ వెళ్లిపోయాడు ప్రశాంత్.

ఇక చివరకు ఇప్పటివరకు నామినేట్ కాకుండా సేఫ్ గా ఉన్నా అమర్ దీప్, ప్రశాంత్, తేజ ముగ్గురిలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని జ్యూరీ సభ్యులను ఆదేశించాడు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో అమర్ దీప్ ను నామినేట్ చేయాలని సందీప్, శివాజీ చెప్పగా.. నాకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది శోభా. చివరకు తేజను నామినేట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!