Telangana: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట.. అప్పటి వరకు విచారణ లేనట్లే..!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కవిత సమన్లు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. దాంతో నవంబర్ 20వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయబోమని కోర్టుకు తెలియజేసింది ఈడీ. పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది.

Telangana: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట.. అప్పటి వరకు విచారణ లేనట్లే..!
K Kavitha
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2023 | 1:51 PM

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కవిత సమన్లు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. దాంతో నవంబర్ 20వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయబోమని కోర్టుకు తెలియజేసింది ఈడీ. పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. మహిళ అయినంత మాత్రానా విచారణ చేయొద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. అయితే, మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాలన్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది కోర్టు. అనంతరం ఈ కేసు విచారణను నవంబర్ 20వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో దర్యాప్తు తీరును తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళను విచారణకు పిలిచే సమయంలో.. రూల్స్‌ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈడీపై గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేసి విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదని, గతంలో నళిని చిదంబరంకు ఇచ్చినట్టే తనకు వెసులుబాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కవిత. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..