Hyderabad: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఒకే రోజు రూ. 1.08 కోట్లు కొల్లగొట్టారు..
Hyderabad News, September 26: సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ వస్తే అలర్ట్‌గా ఉండాలని ఎన్నిసార్లు చెబుతున్నా వినడం లేదు జనాలు. సైబర్ నేరళ్ల ట్రిక్స్‌కు వెంటనే లొంగిపోయి.. వారి వలలో చిక్కుకుపోతున్నారు. తద్వారా తమ కష్టార్జీతం అంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ మోసాలు వెలుగు చూశాయి. రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో బాధితులు ఏకంగా రూ. 1.08 కోట్లు కోల్పోయారు. వీరిలో ఒకరు రూ. 59 లక్షలు కోల్పోగా..
Hyderabad News, September 26: సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ వస్తే అలర్ట్‌గా ఉండాలని ఎన్నిసార్లు చెబుతున్నా వినడం లేదు జనాలు. సైబర్ నేరళ్ల ట్రిక్స్‌కు వెంటనే లొంగిపోయి.. వారి వలలో చిక్కుకుపోతున్నారు. తద్వారా తమ కష్టార్జీతం అంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ మోసాలు వెలుగు చూశాయి. రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో బాధితులు ఏకంగా రూ. 1.08 కోట్లు కోల్పోయారు. వీరిలో ఒకరు రూ. 59 లక్షలు కోల్పోగా.. మరొకరు రూ. 49 లక్షలకు పైగా మోసపోయారు. ఈ రెండు చోరీలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మణికొండలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్‌కు గ్రాడ్యుయేట్ వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌తో మెసేజ్ వచ్చింది. ఈ కామర్స్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఉద్యోగం అది. ఆ లింక్‌ను క్లిక్ చేసి, కాంటాక్ట్ అయ్యింది. వారు చెప్పిన వివరాల ప్రకారం ఫాలో అయ్యింది. మొదట్లో ఆమె చేసిన పనికి జీతం సక్రమంగానే ఇచ్చారు. ఆ తరువాత ప్రమోషన్ పేరుతో ఆమెను టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ కూడా చేశారు. అక్కడ క్రమంగా పనులు ఇచ్చి.. ఆ పనులకు అమౌంట్ కూడా ఇస్తూ వచ్చారు. అయితే, మీరు రూ. 1.20 కోట్లు పొందే అద్భుత అవకాశం ఉందంటూ ఆమెలో ఆశలు కల్పించారు. అయితే, పని చేస్తూనే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని సూచించారు. అలా పలు దఫాలుగా ఆమె నుంచి మొత్తం రూ. 59 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారు. ఇంకా రూ. 40 లక్షల ఇస్తే ఆ మొత్తం కలిపి, డబుల్ అమౌంట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. దాంతో అనుమానం వచ్చి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఇక రెండో ఘటనలో.. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ హెచ్‌పీ గ్యాస్ డీలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. ఓ లింక్‌ను చూసి క్లిక్ చేసింది. డీలర్‌షిప్ కోసం తనకున్న ఆసక్తిని తెలుపుతూ ఆమె తన వివరాలను తెలుపుతూ సదరు లింక్‌లో ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపించింది. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు.. ‘మీకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డీలర్‌షిప్ వచ్చిందని, డిపాజిట్, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి రూ. 49.88 లక్షలు చెల్లించాలి’ అని కోరారు. దాంతో ఆమె ఆ మొత్తాన్ని చెల్లించారు. చెల్లింపునకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు, చెల్లింపు రసీదులను కూడా ఇచ్చారు. సైట్ విజిటింగ్ డేట్ కూడా ఇచ్చారు. ఆ తరువాత సైట్ చూపించే విషయాన్ని వాయిదా వేస్తూ వస్తుండటంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
ఈ రెండు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. లేదంటే భారీ మొత్తంలో డబ్బులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఏమాత్రం అవగాహన రాకపోవడం, చిన్న చిన్న ఆశలకు టెంప్ట్ అయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం ఆందోళనలు కలిగిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..