AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఎమ్మెల్సీల తిరస్కరణ.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు తిరస్కరణకు గురైన దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను పక్కన కూర్చోబెట్టుకుని కేటీఆర్‌ మీడియా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను ఎందుకు పదే పదే అగౌరవపరుస్తున్నారు.. అమృత కాల సమావేశాలని చెప్పి విషం చిమ్మారు? కొత్త పార్లమెంట్‌లో తెలంగాణపై తొలి రోజే విషం చిమ్మారు..

Minister KTR: ఎమ్మెల్సీల తిరస్కరణ.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు
Telangana Minister KTR
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2023 | 3:57 PM

ఎందుకు రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు తిరస్కరణకు గురైన దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను పక్కన కూర్చోబెట్టుకుని కేటీఆర్‌ మీడియా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను ఎందుకు పదే పదే అగౌరవపరుస్తున్నారు.. అమృత కాల సమావేశాలని చెప్పి విషం చిమ్మారు? కొత్త పార్లమెంట్‌లో తెలంగాణపై తొలి రోజే విషం చిమ్మారు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.

ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.  మహబూబ్‌నగర్‌కి ఏం చేశారని ప్రధాని వస్తున్నారు? 10 ఏళ్ల నుంచి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదని.. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల్లో ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాకే పాలమూరు రావాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ .. ఓట్లు కావాలంటే ప్రధానికి మంచి పనులు చేసే సత్తా ఉండాలన్నారు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా.. ప్రజలు నమ్మరని అన్నారు. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశాం.. ఒకరు ప్రొఫెసర్‌, మంచి వ్యక్తి అని ఆమోదిస్తారని అనుకున్నాం.. మరొకరు ట్రేడ్‌ యూనియన్‌లో సేవలు చేస్తున్న సత్య నారాయణ..

అయితే, మోదీ ఎజెండాగా తెలంగాణ గవర్నర్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేశారు. ఆమెను నియమించడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమన్నారు. గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా..? గవర్నర్‌ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వ్యస్థను తీసేస్తారా.. ప్రధాని హోదాని వైస్రాయ్ చేస్తారా.. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయి. మాస్టర్‌ ఆఫ్‌ అటెన్షన్ డైవర్షన్ అంటూ ఎద్దేవ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం