Chandra Babu Arrest: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. ఏం అన్నారంటే ?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన చేపట్టారు. అలాగే చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధమని అన్నారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా.. తెలంగాణలో ఎందుకు ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన చేపట్టారు. అలాగే చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధమని అన్నారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా.. తెలంగాణలో ఎందుకు ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నిరసన తెలపాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడ చేసుకోండని ఉద్ఘాటించారు. బాబు అరెస్టు విషయం రెండు పార్టీల మధ్య తగాదా అని.. ఇందులో తమకేం సంబంధనని అన్నారు. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదంటూ సూచనలు చేశారు. ప్రస్తుతం బాబు కేసుకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని.. ఇక్కడ ర్యాలీలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. అలాగే నారా లోకేష్ తనకు ఫోన్ చేసి ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని అడిగారని.. కానీ మేము హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ముఖ్యమని చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు ఏపీలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు తనకు స్నేహితులేనని పేర్కొన్నారు.