Telangana Congress: లెక్క సరిపోవడం లేదు.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 సీట్లు ఇవ్వడం కష్టమేనట..!

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకుంటుంది కానీ పరిస్థితి మాత్రం అందుకు సానుకూలంగా కనిపించడం లేదు. మరోపక్క బీసీ నేతలు ప్రతి పార్లిమెంట్ కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు.. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమీ చేయబోతోంది? ప్రత్యేక కథనం మీకోసం..

Telangana Congress: లెక్క సరిపోవడం లేదు.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 సీట్లు ఇవ్వడం కష్టమేనట..!
Telangana Congress
Follow us
TV9 Telugu

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2023 | 7:06 AM

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకుంటుంది కానీ పరిస్థితి మాత్రం అందుకు సానుకూలంగా కనిపించడం లేదు. మరోపక్క బీసీ నేతలు ప్రతి పార్లిమెంట్ కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు.. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమీ చేయబోతోంది? ప్రత్యేక కథనం మీకోసం..

బీసీ రాగం.. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలో సహజంగా వినిపించే నినాదం. ప్రతి సారి వివాదంగా ముగిసే అంశం కూడా ఇదే.. అయతే కాంగ్రెస్ పార్టీలో ఈ సారి మొదటి నుండి బీసీ నాయకులు తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తునే ఉన్నారు. ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎక్కడపడితే అక్కడ తమ సీట్లు ఇవ్వకుండా ఈ పార్లమెంట్లో రెండు సీట్లు బీసీలకు కేటాయించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. గతంలో లాగా ఓల్డ్ సిటీలో ఓడిపోయే స్థానాల్లో కాకుండా ఈ విధంగా ఇస్తే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని బీసీ నాయకులు వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా కొంతమంది బీసీ నాయకులు అదే డిమాండ్ ఉంచారు. మరోపక్క pcc అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది, బీఆర్ఎస్ కన్న ఎక్కువ సీట్లు ఇచ్చి తీరుతామని బలంగా చెబుతున్నారు..

అయితే పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సానుకూల పరిస్థితి ఏమి కనిపించడం లేదని కొందరు నేతలు అభిప్రాయడుతున్నారు. లెక్కలు చూసుకుంటే బీఆర్‌ఎస్‌కు ఉన్న ఒకటి రెండు ఎక్కువ సీట్లు ఇవ్వొచ్చేమో గాని బీసీ నాయకుల డిమాండ్ కు తగ్గట్టుగా సీట్లు కేటాయించలేం అనేది కొందరి నాయకుల అభిప్రాయం. దాదాపు 11 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదు. ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే కేటాయించిన సీట్లు 31.. ఇవి కాక మరొక 35 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ సీనియర్ నాయకులు ఉండనే ఉన్నారు… వారిని కాదని అక్కడ బీసీలకు కేటాయించే పరిస్థితి లేదు. ఇప్పటికే మొత్తం సీట్ల సంఖ్య 77 సీట్లు అయ్యింది. మిగిలినవి 42.. ఈ 42 సీట్లలో గెలుపు ప్రాతిపదికన చూస్తే బీసీలకు సగానికి కన్న తక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందని భయం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నెలకొంది. అప్లికేషన్లు వేసి లెక్కలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమందికి అసలు సీన్ అర్థమైంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలనే ఆలోచనలో పడ్డారు నేతలు.

ఇక పార్లమెంట్‌కు రెండు బీసీ సీట్లు అనేది మరింత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు నల్గొండ పార్లమెంటు స్థానంలో ఒక దేవరకొండ ఎస్సీ నియోజకవర్గమైన ఇస్తే ఆరు నాన్ రిజర్వ్ నియోజకవర్గాలున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్ నగర్, కోదాడ నియోజవర్గలు ఉన్నాయి. నల్గొండలో తప్ప అన్ని స్థానాల్లో పోటీ కూడా రెడ్ల మధ్య ఉంది. నల్గొండ అసెంబ్లీకి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్ అప్లై చేసుకున్నారు. ఇక్కడ చెరుకు సుధాకర్ బీసీ అయిన కోమటిరెడ్డి ఆయనకు సీట్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఖమ్మం పార్లిమెంట్‌లో ఉన్న మూడు ఓపెన్ సీట్ల లో బీసీలకు ఇచ్చే పరిస్థితి లేదు.. ఇలా అనేక పార్లమెంట్లలో ఇలాంటి సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న ఎక్కువ సీట్లు ఇచ్చినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీసీ నాయకులు కోరినట్టుగాను పార్లమెంటుకు రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదనేది నేతలకు చాలా స్పష్టంగా అర్థం అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..