Kavitha: భారత రాజ్యాంగమా? బీజేపీ రాజ్యాంగమా..? ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా.. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఎమ్మెల్సీ కే కవిత తప్పుబట్టారు.
ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా.. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఎమ్మెల్సీ కే కవిత తప్పుబట్టారు. బీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. బీజేపీ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. శాసన మండలి ఆవరణలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కవిత పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఉనికి చాటుకోలేని వర్గాలకు మండలిలో అవకాశం కల్పించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్లు మాత్రం కేసీఆర్ ఆశయాలతో విభేదించడం బాధాకరమన్నారు. మండలికి సిఫార్సు చేసిన ఇద్దరు బీసీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమంటూ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు విషయంలో కూడా బీజేపీ తన బీసీ వ్యతిరేక భావజాలాన్ని బయట పెట్టుకుందంటూ ఫైర్ అయ్యారు.
రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటూ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయం.. కానీ అనేక కారణాలను చెప్పి పేర్లను తిరస్కరించారన్నారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా.. బీజేపీ రాజ్యాంగం నడుస్తోందా.. గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారంటూ కవిత వ్యాఖ్యానించారు. గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని.. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయంటూ గుర్తుచేశారు.
కవిత మాట్లాడిన వీడియో చూడండి..
చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతోపాటు మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎంపి వెంకటేష్ నేత పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..