AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరింత జోష్.. రూ. 8కోట్లతో దుర్గం చెరువు దగ్గర మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు.. కళ్లు జిగేల్ అనాల్సిందే..

హైదరాబాద్ నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో నూతన అద్యాయానికి శ్రీకారం చుట్టింది. హుస్సెన్‌ సాగర్‌ తరహాలో దుర్గం చెరువులోను మ్యూజిక్ ఫౌంటేన్‌లను ఏర్పాటుచేసింది.

Hyderabad: హైదరాబాద్‌లో మరింత జోష్.. రూ. 8కోట్లతో దుర్గం చెరువు దగ్గర మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు.. కళ్లు జిగేల్ అనాల్సిందే..
Durgam Cheruvu
Shaik Madar Saheb
|

Updated on: Sep 26, 2023 | 12:20 PM

Share

Musical fountains at Durgam Cheruvu: కళ్లు జిగేల్ మనేలా.. మనసు పులకరించేలా మ్యూజికల్ ఫౌంటేన్ దుర్గం చెరువు దగ్గర ఏర్పాటు చేశారు. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు సరికొత్తగా మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. మిరిమిట్లు గొలిపై లైటింగ్‌తో మెరిసిపోతున్న మ్యూజికల్‌ ఫౌంటైన్‌ చూసి కేరింతలు కొడుతున్నారు పర్యాటకులు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయలతో ఈ మ్యూజికల్ ఫౌంటైన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరంలో హుస్సేన్‌సాగర్ లో మ్యూజికల్ ఫౌంటైన్‌ అలరిస్తుండగా.. తాజాగా దుర్గం చెరువులోను ఏర్పాటు చేశారు హెచ్‌ఎండీఏ అధికారులు.ఈ ఫౌంటైన్‌ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు.

అటు.. దుర్గంచెరువు మురుగునీటి శుద్ధి కర్మాగారం STPని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కోకాపేట STP నిర్వహణ దశలో ఉంది. దేశంలోనే వందశాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించబోతోంది మన భాగ్యనగరమని చెప్పారు. 2000 మిలియ‌న్ లీట‌ర్స్ ఫ‌ర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. దుర్గం చెరువు వ‌ద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించాం. ఎస్టీపీలు పూర్తయితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వ‌దిలే ప‌రిస్థితి వస్తుందన్నారు. మంచిరేవుల – ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు మూసీ న‌దిని అద్భుతంగా సుంద‌రీక‌రించాల‌న్న సీఎం క‌ల‌ను నెర‌వేరుస్తామన్నారు కేటీఆర్.

Musical Fountain

Musical Fountain

హైదరాబాద్‌ పర్యాటక ప్రాంతాలు కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. సందర్శనీయ స్థలాలు మరింత అందంగా తయారవుతున్నాయి. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరికొత్త హంగులు అద్దుకోగా.. ఇప్పుడు దుర్గంచెరువులో మ్యూజికల్ ఫౌంటేన్‌లను ఏర్పాటుచేసి హైదరాబాద్ కు మరింత శోభ తీసుకొచ్చింది టీసర్కార్.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..