Telangana: గణేష్ నవరాత్రుల్లో పాల్గొన్న ముస్లిం కుటుంబం.. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు!
గణేష్ ఉత్సవాలు అనగానే ఊరు -వాడ, పల్లె -పట్టణం అని తేడా లేకుండా 11 రోజుల పాటు పూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేస్తారు. తీరొక్క విగ్రహం, తీరొక్క పూలతో పూజిస్తూ.. రోజు కొక్క ప్రసాదాన్ని స్వామి వారికి నైవేద్యంగా అందిస్తూ పూజలు చేస్తారు. ఇలా 11 రోజులు ప్రతి గల్లీ సందడి గా కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో గణపతి మండపాల వద్ద చిన్న పిల్లలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తు 11 రోజుల..
ఖమ్మం, సెప్టెంబర్ 26: గణేష్ ఉత్సవాలు అనగానే ఊరు -వాడ, పల్లె -పట్టణం అనే తేడా లేకుండా 11 రోజుల పాటు పూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేస్తారు. తీరొక్క విగ్రహం, తీరొక్క పూలతో పూజిస్తూ.. రోజు కొక్క ప్రసాదాన్ని స్వామి వారికి నైవేద్యంగా అందిస్తూ పూజలు చేస్తారు. ఇలా 11 రోజులు ప్రతి గల్లీ సందడి గా కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో గణపతి మండపాల వద్ద చిన్న పిల్లలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తు 11 రోజుల తరువాత గంగమ్మ ఒడికి గణపతులను సాగనంపుతాము.
అయితే ఈ పూజ కార్యక్రమలు చేసుకోవడానికి మన పెద్దవాళ్ళు ఆచరించి, అనుసరిస్తూ వస్తున్న వాటినే మనం ఈనాటికి పాటిస్తున్నాము. అయితే వాటికి మేము తోడు ఉన్నాము అంటూ కుల మతాలకు అతిథంగా ఓ ముస్లిం కుటుంబం గణేష్ వద్ద పూజ కార్యక్రమాలు చేశారు. దీనిని చూసిన జనం వారిని అభినందిస్తు హిందు-ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుల,మతాలకు అతీతంగా ఖమ్మంలో ఓ ముస్లిం కుటుంబం అందరిని ఆశ్చర్యనికి గురి చేసింది. షేక్ సలీం, నజీమా దంపతులు గణేష్ నవరాత్రుల్లో భాగంగా పూజ కార్యక్రమములలో పాల్గొన్నారు. ఇలా కుల,మతాలకు తావివ్వకుండా ఈ అనుబంధాలు శాశ్వతంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ పూజలు చేశారు. తల పై ముస్లిం సంప్రదాయ టోపిని ధరించి, మొహానికి కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముస్లిం కుటుంబాన్ని చూసి అందరూ ఇలానే ప్రతి పండుగ కలిసి చేసుకోవాలి అని కోరుతున్నారు.
అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి సూసైడ్
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికినా ప్రయోజనం లేకపోవడంతో అదే రోజు అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల గాలించారు. ఈ నేపథ్యంలో బాలుడి కుటుంబం నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్ ముందు మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో రక్తపు మడుగులో కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభ్యమైంది. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్ధి, చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.