Telangana: అవార్డులు, జ్ఞాపికలు తయారు చేసే ఆ గ్రామానికే అరుదైన అవార్డు.. ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక
నంది అవార్డులకు రూపం దిద్దిన ఘనత కూడా ఈ పెబార్తి వాసులదే.. తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల లోగో పై కాకతీయ తోరణం నమూనా వుంటుంది.. ఏపీ ప్రభుత్వ అవార్డులలో పూర్ణకుంభం, మూడు సింహాల నమూనా వుంటుంది..ప్రభుత్వ కార్యక్రమాల కు సంబంధించిన అవార్డులు కానీ ఇతర గొప్ప గొప్ప అవార్డులు, భారీ విగ్రహాల తయారీ కూడా ఇక్కడ ఉండే జరుగుతుంది.
నిజంగా ఇది ఒక అరుదైన ఘట్టం.. వూహించని సన్నివేశం.. ఎవరికైనా ఏదైనా ఒక అవార్డు దక్కిందంటే చాలా గర్వంగా భావిస్తాం.. పదిమందిలో ఆ జ్ఞాపిక, అవార్డు తీసుకోవడం అదృష్టంగా భావించి జన్మ ధన్యమైనట్లుగా ఉప్పంగిపోతుంటాం… కానీ ఆ వార్డులు ఎవరు చేసే వారికే అవార్డు వస్టే.. తయారుచేసిన చేతులతోనే అవార్డు అందుకుంటే ఆ ఫీలింగ్ ఎలా వుంటుంది. అసలు జ్ఞాపికలు, అవార్డులు ఎక్కడ తయారుచేస్తారు..? ఎక్కడి నుండి వస్తాయి..? నగిషీల తయారీకి సంబంధించిన ముడి సరుకు ఎక్కడ తయారుచేస్తారు..! ఆఖరికి నంది అవార్డులు కూడా ఎక్కడ తయారుచేస్తారో అనేది ఎవరికి తెలియని విషయం.
హస్తకలకు పెట్టింది పేరు జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం.. ఎన్నో గొప్పగొప్ప అవార్డులన్నీ ఇక్కడే రూపు దిద్దుకుంటారు.. ఆలయాల ధ్వజ స్తంభాలు, ప్రధాన ద్వారాలను ఇత్తటి కవచాలు కూడా ఇక్కడే తయారు చేస్తారు. జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ప్రత్యేకత వుంది.. ఎక్కడ ఏ అవార్డులు కావాలన్నా అధికారులైన, ఇతర ప్రైవేట్ సంస్థలైన ఈ ఊరి గడప తొక్కాల్సిందే.. ఇక్కడ ప్రత్యేక ఆర్డర్ పై వివిధ రూపాల్లో ఆకారాల్లో నగిశీలు తయారు చేస్తారు
నంది అవార్డులకు రూపం దిద్దిన ఘనత కూడా ఈ పెబార్తి వాసులదే.. తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల లోగో పై కాకతీయ తోరణం నమూనా వుంటుంది.. ఏపీ ప్రభుత్వ అవార్డులలో పూర్ణకుంభం, మూడు సింహాల నమూనా వుంటుంది..ప్రభుత్వ కార్యక్రమాల కు సంబంధించిన అవార్డులు కానీ ఇతర గొప్ప గొప్ప అవార్డులు, భారీ విగ్రహాల తయారీ కూడా ఇక్కడ ఉండే జరుగుతుంది.
కేవలం మనదేశంలోనే కాదు అమెరికా, జర్మనీ, బెల్జియం, రష్యా కెనడా, జపాన్ ఇలాంటి ఎన్నో దేశాలకు కూడా ఇక్కడినుండి కంచు, ఇత్తడి కళారూపాలు ఎగుమతి అవుతాయి.. ఆన్ లైన్ లో బుక్ చేసుకొని జ్ఞాపికలు, ఇత్తడి విగ్రహాలు పర్చేజ్ చేస్తుంటారు.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పెంబర్తి గ్రామం ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.. అవార్డులకు రూపు దిద్దే ఈ గ్రామం ఇప్పుడు అరుదైన అవార్డును అందుకోబోతుంది. బెస్ట్ టూరిజం కాంపిటీషన్ -2023 అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 796 గ్రామాలు దరఖాస్తులు చేసుకున్నాయి.. ఈ క్రమంలో జూన్ 6వ తేదీన పెంబర్తి గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందాలు పెంబర్తి గ్రామాన్ని అవార్డుకు ఎంపిక చేశారు.. ప్రతిఏటా ఈ గ్రామాన్ని 25 వేలమంది సందర్శిస్తున్నట్లు గుర్తించారు.
హస్తకళ నైపుణ్యం, జ్ఞాపకాల తయారీలో ఈ గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైది..ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా 27వ తేదీ బుధవారం రోజున ఢిల్లీలో ఈ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కలిసి అవార్డును స్వీకరిస్తారు.
జ్ఞాపికలు, ఇత్తడి విగ్రహాల తయారీ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుపొందిన పెంబర్తి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఘనకీర్తి అందుకోబోతుండడం పట్ల ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.. జి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ శివలింగయ్య పెంబర్తి కళాకారులు, గ్రామ సర్పంచ్ ను అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..