Telangana: అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారు.. ఏం లేదంటూ పడుకోబెట్టిన తల్లి.. అర్ధరాత్రి అసలేం జరిగింది..?
బొగ్గు బట్టీల వద్ద కాపలాగా ఉన్నారు ఆ దంపతులు.. భార్య, కొడుకుతో కలిసి నిద్రిస్తోంది.. ఇంతలో అర్ధరాత్రి అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారంటూ ఐదేళ్ల బాలుడు తల్లికి చెప్పాడు. కానీ ఆ తల్లి పడుకోమని చెప్పి వారించింది. తెల్లవారేసరికి తండ్రి విగత జీవిగా మారాడు. ఆ బాలుడు చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బొగ్గు బట్టీల వద్ద కాపలాగా ఉన్నారు ఆ దంపతులు.. భార్య, కొడుకుతో కలిసి నిద్రిస్తోంది.. ఇంతలో అర్ధరాత్రి అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారంటూ ఐదేళ్ల బాలుడు తల్లికి చెప్పాడు. కానీ ఆ తల్లి పడుకోమని చెప్పి వారించింది. తెల్లవారేసరికి తండ్రి విగత జీవిగా మారాడు. ఆ బాలుడు చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బాలుడు ఏం చెప్పాడు..? పోలీసులకు కీలకంగా మారిన ఆ బాలుడు మాటలు ఏంటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. నూతనకల్ మండలం బక్కహేములతండాకు చెందిన గుగులోతు చాంప్లానాయక్(35)కు అదే గ్రామానికి చెందిన అరుణతో 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు నకిరేకల్ గురుకుల పాఠశాలల్లో చదువు తున్నారు. ఐదేళ్ల కుమారుడు వీరి వద్దే ఉంటున్నాడు. పక్కనే ఉన్న అర్వపల్లి మండలం పూర్యాతండాలో బొగ్గు బట్టీల వద్ద కాపలాగా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగిన వీరి సంసారంలో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి.
అయితే, రాత్రి తండాలో గణేష్ విగ్రహం వద్ద జరిగిన అన్నదానం, పూజల్లో దంపతులు పాల్గొన్నారు. తర్వాత తండా సమీపంలో ఉన్న బొగ్గుల బట్టి వద్ద భార్య కొడుకుతో చాంప్లా నాయక్ నిద్రించాడు. అర్ధరాత్రి చాంప్లా నాయక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పిడిగుద్దులతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ శబ్దాల అలికిడికి మేలుకువ వచ్చి చూసిన ఐదేళ్ల బాలుడు అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారంటూ తల్లిని లేపాడు. కానీ పడుకోమని చెప్పి తల్లి వారించింది. తెల్లవారిన తర్వాత భార్య అరుణ.. కొడుకును తీసుకుని బక్కహేములతండాకు వెళ్లి తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని తండావాసులు, కుటుంబ సభ్యులకు చెప్పింది. భర్తతో గొడవల నేపథ్యంలో తండావాసులు అరుణను నిలదీయగా, ఆమె సరైన సమాధానం చెప్పలేదు. ఐదేళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు, తండావాసులు అడగగా అర్ధరాత్రి అమ్మ, నాన్నల మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు నాన్నను కొట్టారని చెప్పాడు.
బాలుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో అరుణ ప్రియుడితో కలిసి తన కుమారుడు చాంప్లానాయక్‌ను హత్య చేసిందని తల్లి గుగులోతు జక్కా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అర్వపల్లి పోలీసులు అరుణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.