Andhra Pradesh: అపురూపం ఆ విఘ్నేశ్వరుడి దర్శనం.. మినీ కాణిపాకంలో రోజుకో అలంకరణలో స్వయంభువు..

Anakapalli District: పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ వినాయకుడి తొండం భూమి లోపలికి చొచ్చుకుని ఉంటుంది. అందుకే అక్కడ నుంచి పూర్వం తరలించాలని అనుకున్నా విగ్రహం కదల్లేదని అంటున్నారు చలపతిరావు ప్రధాన అర్చకులు. ఇక్కడి  స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొదలుపెట్టే  ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుందని భక్తుల సంపూర్ణ నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ కాణిపాకం అని పిలుస్తుంటారు కొంతమంది భక్తులు.

Andhra Pradesh: అపురూపం ఆ విఘ్నేశ్వరుడి దర్శనం.. మినీ కాణిపాకంలో రోజుకో అలంకరణలో స్వయంభువు..
Swayambu Vigneswara Swamy
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 27, 2023 | 4:58 PM

విశాఖపట్నం, సెప్టెంబర్ 27;  అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభు విగ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిసాయి. రోజుకో అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు. చివరి రోజు పత్ర పుష్ప ఫల విశేష అలంకరణ చేసి భక్తులకు కార్యసిద్ధి గణపతి గా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. కాణిపాకం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయం చోడవరం స్వయంభు విజ్ఞేశ్వర ఆలయం.  అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో స్వయంభువుగా వెలసి ఉన్న విఘ్నేశ్వర స్వామి సుమారు 200 సంవత్సరముల చరిత్రగలిగినది. దేవస్థానం నిత్య ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతూ భక్తులకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడుతున్న స్వామి స్వయంభు విఘ్నేశ్వర స్వామి.

ఆంధ్రప్రదేశ్ లో స్వయంభువుగా వెలసిన రెండు వినాయక క్షేత్రాల్లో.. మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం కాగా రెండవది అనకాపల్లి జిల్లా చోడవరం ఆలయం. స్వామివారి పూర్వకాలంలో గొల్ల వాళ్ళు కనుగొని గ్రామస్తులు తెలియపరచగా విఘ్నేశ్వరుని పోలికలతో ఉన్న రాతి శిలగా…. గ్రహించి అతిపురాతన శివాలయంలో ప్రతిష్టంచాలని అనుకున్నా.. అక్కడ నుంచి కదిలించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడే ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్వయంభు విజ్ఞేశ్వర ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలు చివరి దశలో భారీగా భక్తులు హాజరయ్యారు. రోజుకో అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. వినాయక చవితి మొదటి రోజు తెల్లవారు జామున నుండి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి రెండవ రోజు సిందూర అలంకరణ, మూడవ రోజు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగవ రోజు భస్మ అలంకరణ, ఐదవ రోజు కుంకుమ అలంకరణ, ఆరవ రోజు పసుపు అలంకరణ, ఎడవ రోజు చందన అలంకరణ, ఎనిమిదవ రోజు పసుపు, కుంకుమ అలంకరణ.. తొమ్మిదవ రోజు భస్మ సహిత చందన అలంకరణ తరువాత సాయంత్రం స్వయంభూ శ్రీ విగ్నేశ్వర స్వామివారికి గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు సందర్భంగా పత్ర పుష్ప ఫల విశేష అలంకరణ చేసి భక్తులకు కార్యసిద్ధి గణపతి గా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు.

పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ వినాయకుడి తొండం భూమి లోపలికి చొచ్చుకుని ఉంటుంది. అందుకే అక్కడ నుంచి పూర్వం తరలించాలని అనుకున్నా విగ్రహం కదల్లేదని అంటున్నారు చలపతిరావు ప్రధాన అర్చకులు. ఇక్కడి  స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొదలుపెట్టే  ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుందని భక్తుల సంపూర్ణ నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ కాణిపాకం అని పిలుస్తుంటారు కొంతమంది భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..