Hyderabad: రెడీమేడ్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు అలవాటు పడ్డారా..? అయితే, ఆస్పత్రిలో బెడ్‌ రెడీ అయినట్టే.. ! విషం కంటే డేంజర్‌

Hyderabad: ఉప్పల్ పిఎస్ పరిధి ఓల్డ్ రామంతపూర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు స్థానిక ఉప్పల్ పోలీసులతో కలిసి దాడి చేశారు. మానవ ఆరోగ్యానికి హాని కలిగించే టైటానియం, సిట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ (25) అనే వ్యాపారిని అరెస్టు చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ చేసే కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు.

Hyderabad: రెడీమేడ్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు అలవాటు పడ్డారా..? అయితే, ఆస్పత్రిలో బెడ్‌ రెడీ అయినట్టే.. ! విషం కంటే డేంజర్‌
Ginger&garlicpaste
Follow us
Sravan Kumar B

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 27, 2023 | 5:39 PM

హైదరాబాద్, సెప్టెంబర్27; మార్కెట్లో ఏది కొనాలన్నా కల్తీ భయం వేస్తోంది. ఉప్పు పప్పు మొదలు అల్లం బెల్లం దాకా అంతా కల్తీ మయమైపోయింది. పరిగెడుతున్న కాలంలో మనమంతా ఇన్స్టంట్ ఫుడ్ కి అలవాటు పడ్డం. ఏదైనా అనుకున్న వెంటనే రెడీమేడ్ గా ఉందంటే సొంతంగా తయారు చేసుకునే దానికన్నా దానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఈ కల్తీల వల్ల ఎక్కువగా నష్టం కలుగుతుంది ఫుడ్ ప్రొడక్ట్స్ లోనే. వంటల్లో టేస్ట్ కోసం వాడే ఆహార పదార్థాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. కాబట్టి ప్రతిచోట అల్లం వెల్లుల్లి తయారీ కర్మాగారాలు వెలిసాయి. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్నచిన్న ఫుడ్ స్టాల్స్ లో ఇన్స్టంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వాడుతారు. ఇలా ఇన్స్టంట్ గా కొనుగోలు చేస్తేనే ఖర్చు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. ట్రాన్స్పోర్ట్ చేసి, లాభాలు చూసుకుని అమ్మే ప్రోడక్ట్ లో కూడా అంత తక్కువ రేటుకు ఇస్తున్నారంటే అందులో కచ్చితంగా నాణ్యత లోపాలు ఉంటాయనేది నూటికి నూరు శాతం సత్యం. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో దొరికేది ఏదైనా వందకు వందశాతం కల్తీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నీతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత వాస్తవామో మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్టులో అల్లం ఉండదనేది కూడా అంతే వాస్తవం. అల్లం వెల్లుల్లి లేకుండానే పేస్టు తయారు చేస్తున్నారు.కుళ్లిపోయిన వెల్లుల్లి తోపాటు, వెల్లుల్లి పొట్టును కలిపి అందులో పలు రకాల ప్రమాదకరమైన రసాయనాలను రంగు కోసం,రుచి కోసం, మంచి సువాసన వచ్చేందుకు, ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు కలుపుతున్నారు. అందులో కొన్ని అతి ప్రమాదకరమైన రసాయనాలు ఉండటంతో డేంజర్ గా మారుతున్నాయి. టైటానియం డయాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను వెల్లుల్లి పేస్టు లో వాడుతున్నారు. టైటానియం డయాక్సైడ్ రబ్బర్, టెక్స్టైల్స్, పెయింట్స్, ఇంక్, పేపర్, సిరామిక్ తయారీలో వాడే కెమికల్ . అల్లం వెల్లుల్లి పేస్ట్ లో దీన్ని వాడటం వల్ల కుళ్ళిన కూడా తెలియకుండా ఎక్కువకాలం నిలువ ఉంటుంది. ఉప్పల్ పిఎస్ పరిధి ఓల్డ్ రామంతపూర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు స్థానిక ఉప్పల్ పోలీసులతో కలిసి దాడి చేశారు. మానవ ఆరోగ్యానికి హాని కలిగించే టైటానియం, సిట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ (25) అనే వ్యాపారిని అరెస్టు చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ చేసే కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఉప్పల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.

బయట హోటల్స్ లో రుచి బాగుందని లొట్టలేసుకుని తినేవారు నూటికి 90 శాతం కల్తీ అని గుర్తుంచుకోవడం మంచిది. మరి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు వాడుతారు కాబట్టి రోడ్ల మీద ఉండే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!